Wed. Feb 19th, 2020

Sambashana

Online News Portal

పూజ లక్ అక్కినేని కుర్రాడికి పాస్ అవుతుందా?

1 min read
akhil 4th movie

అక్కినేని వారసుడు అఖిల్, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది. గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ మూవీకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ కి తగినట్లుగానే ఎనర్జిటిక్ గా ఉంటూ… యూత్అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ అయిన ఈ మూవీలో అఖిల్ లుక్ ని ఫెబ్ 8 సాయంత్రం 6:18ని రిలీజ్ చేయనున్నారు. మూడు సినిమాల్లో కనిపించని లుక్ లో అఖిల్ కనిపించబోతున్నాడని సమాచారం.

ఇప్పటివరకూ అఖిల్ చేసిన అఖిల్, హ‌లో, మిస్ట‌ర్ మజ్ను సినిమాలన్నీ నిరాశపరచడంతో అక్కినేని అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్ కి, తప్పని సరిగా హిట్ కొట్టాలి అనే పరిస్థితిలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ కలిశాడు. ఈ ఇద్దరికీ హిట్ కి కెరాఫ్ అడ్రెస్ గా ఉన్న లక్కీ డాల్ పూజా హెగ్డే తోడవ్వడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కొత్త హైప్ తెచ్చింది. మరి పూజా లుక్ అఖిల్ కి పాస్ అయ్యి, నాలుగో సినిమాతో అయినా అక్కినేని వారసుడు హిట్ ఇస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.