Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

తెలంగాణ యాసతో అక్కినేని కుర్రాడు…

1 min read

మజిలీ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి కంబ్యాక్ ఇచ్చిన అక్కినేని కుర్రాడు నాగ చైతన్య, ఇప్పుడు శేఖర్ కమ్ములతో కలిసి మూవీ చేస్తున్నాడు. లవ్ స్టోరీస్ తొ సక్సస్ అందుకుంటున్న నాగ చైతన్యకి, యూత్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే సినిమాలు చేసే శేఖర్ కమ్ముల కలవడం… పైగా మొదటిసారి చైతన్య పక్కన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ సోమ‌వారం ప్రారంభమైంది. ఈ లాంచ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైమ్‌ ఒక మ్యూజికల్ లవ్ స్టొరీలో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగ చైతన్య బాగా ఇష్ట పడి నేర్చుకున్నాడు. నాగ చైతన్య పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. సాయి పల్లవి ఈ కథకు పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు“ అన్నారు. సో శేఖర్ కమ్ముల మాటలు వింటుంటే, ఫిదా సినిమాలో సాయి పల్లవితో తెలంగాణ యాసలో మాట్లాడి మంచి హిట్ అందుకున్నాడు, ఇప్పుడే అదే ట్రెండ్ లో హీరోతో తెలంగాణ యాస మాట్లాడించి హిట్ కొట్టేలా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.