Sat. Sep 14th, 2019

Sambashana

Online News Portal

రామయ్య… రాజన్నతో కానిది కేసీఆర్ చేస్తాడా?

1 min read

సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు కానీ సునామి కన్నా వేగంగా సమాజానికి అవి తాకిపోతాయి. అలా వైరల్ అవుతున్న వార్తల్లో కేటీఆర్ పది రోజుల్లో సీఎంగా ప్రమాణశ్వీకారం చేయబోతున్నాడు. ఈ వార్త బయటకి రాగానే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నటసార్వభౌమగా పేరు గడించిన నందమూరి తారక రామారావు తన సొంత పార్టీ పెట్టినా కూడా తన వారసులని ముఖ్యమంత్రిగా చూడలేకపోయాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సీఎంగా తనదైన ముద్ర వేసిన దివంగత రాజశేఖర్ రెడ్డి కూడా తన కొడుకుని సీఎంగా చూడలేకపోయాడు. తెలుగు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు సీఎంలతో కానిది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు సాధించగలడా అనేది చూడాలి. కొడుకుని సీఎం చేసి రాష్ట్ర బాధ్యతలు అప్పగించేసి సెంట్రల్ లో తన సత్తా చూపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నాడు.

కేసీఆర్ తన కొడుకుని సీఎం చేసి కేంద్ర రాజకీయాలపై ద్రుష్టి సారించాలని ఎలా ఆలోచిస్తున్నాడో, తెలంగాణపై పట్టు సాధించాలని చూస్తున్న కేంద్రం కూడా అలానే ఆలోచిస్తూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణాశ్వీకారం చేసిన మరుక్షణం బీజేపీ తన పావులు కదపడం మొదలవుతుంది. అందులో భాగంగానే తెరాస పార్టీ పుట్టడంలో, పురోగతి సాధించడంలో కీ రోల్ ప్లే చేసిన హరీష్ రావుని తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే కాస్త నిరాశలో ఉన్న హరీష్ రావుకి సీఎం పదవి ఇచ్చి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలనేది బీజేపీ ప్లాన్. ఇప్పుడున్న పరిస్థితిలో కేటీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణాలో జరగబోయే రాజకీయ పరిణామాలు ఇవి. హరీష్ రావు బీజేపీ వైపు వెళ్లిపోతే, ప్రస్తుత క్యాబినెట్ లో అతనికి అండగా నిలిచే వాళ్లు కూడా తెరాస నుంచి బయటకి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇదే జరిగితే కేటీఆర్ సీఎం అయినా కూడా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తప్పదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు కేటీఆర్ ప్రభుత్వానికి వచ్చే కష్టం లేకపోయినా 2024 సమయానికి బీజేపీ బలపడి తెరాసకి ఇచ్చే అవకాశం అయినా ఉంది. ఇవన్నీ ఆలోచించిన కేసీఆర్, కొడుకుని సీఎం చేయడంతో పాటు హరీష్ రావుని బుజ్జగించే పనులు కూడా చేస్తాడా? రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.