Mon. Jan 27th, 2020

Sambashana

Online News Portal

సూపర్ స్టార్ అల్లుడు కూడా చిరుని ఫాలో అవ్వాల్సిందే

1 min read
dhanush

దాదాపు అరడజను మంది హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి… చిరు పాత హిట్ సినిమాల టైటిల్ తో, అల్లు అర్జున్… రామ్ చరణ్ లాంటి హీరోలు మూవీస్ చేస్తే చూడాలని మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా హీరోలకి షాక్ ఇస్తూ… తమిళ హీరోలు మెగా టైటిల్స్ పై పడుతున్నారు. రీసెంట్ గా కార్తీ, చిరు హిట్ సినిమా ఖైదీ పేరుతో సినిమా చేసి, కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. దీపావళికి రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత అదే కార్తీ, దొంగ సినిమా చేసి యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఇది కూడా చిరు టైటిల్ కావడం విశేషం.

కార్తినే అనుకుంటే స్టార్ హీరో విజయ్ కూడా చిరు టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. మాస్టర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు. చిరంజీవి టైటిల్స్ పై కోలీవుడ్ హీరోలు కన్నేయడం ఇక్కడితో ఆగిపోలేదు. సూపర్ స్టార్ రజిని అల్లుడు, నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ కూడా అదే రూట్ ని ఫాలో అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న డాన్ సినిమాకి రుస్తుం అనే టైటిల్ ఫైనల్ చేశారు. త్వరలో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇతర ఇండస్ట్రీల హీరోలు మన మెగాస్టార్ టైటిల్స్ తో హిట్ కొడుతున్నారు. మరి మెగా హీరోలు, చిరు టైటిల్స్ తో సినిమాలు ఎప్పుడు చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.