Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ హ్యాండిచ్చాడా?

1 min read

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఈ ప్రాజెక్ట్ అయిపోగానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఓపెన్ గానే ఈ ప్రాజెక్ట్ గురించి ఆన్నౌన్స్ చేశారు. అయితే లేటెస్ట్ గా రెండు రోజుల క్రితం ప్రశాంత్ నీల్, మహేశ్ బాబును కలిసి మంచి లైన్ చెప్పాడని… మహేశ్ కూడా ప్రశాంత్ నీల్ చెప్పిన లైన్ నచ్చి కథని కంప్లీట్ చేయమని చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటకి రాగానే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కి హ్యాండిచ్చాడు అని అంతా అనుకుంటున్నారు. అయితే మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సరిలెరు నీకెవ్వరు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది, కేజీఎఫ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ మహేశ్ బాబును కలిసి లైన్ చెప్పాడట. ప్రశాంత్ నీల్, మహేశ్ కాంబోలో సినిమా రావడం నిజమే కానీ ఈ మూవీ కన్నా ముందే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందట. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ కథని కూడా సిద్ధం చేశాడని, రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా షూట్ అయిపోగానే తారక్ ని కలిసి కంప్లీట్ నేరేషన్ ఇవ్వనున్నడట. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అయ్యే లోపు, మహేశ్ బాబు కూడా తనకి ఉన్న కమిట్మెంట్స్ ని పూర్తి చేస్తాడు కాబట్టి ఆ తర్వత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.