Wed. Feb 19th, 2020

Sambashana

Online News Portal

హాట్ ఫొటోస్ తో హీట్ పెంచింది…

1 min read
ileana hot photos

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఎప్పుడూ ఉంటుంది. అందుకే పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలని తీసుకొచ్చి ఇక్కడ స్టార్స్ ని చేస్తుంటారు. ఈ కోవలో ప్రతి ఆరు నెలలకో, ఏడాదికో ఒక కొత్త హీరోయిన్… సడన్ గా స్టార్ అయిపోతూ ఉంటుంది. రీసెంట్ గా రష్మిక ఈ కోవకి చెందినదే. కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోస్ తో సినిమాలు చేస్తోంది. రష్మిక స్టార్ స్టేటస్ అందుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండడంతో కొంతమంది హీరోయిన్లకి ఆఫర్ లు తగ్గాయి.

ఇలా కొత్తనీరు వచ్చిన ప్రతిసారీ పాతనీరు కనిపించకుండా పోతుంది. తాను ఈ లిస్ట్ లో ఉండకూడదు అనుకుందో ఏమో కానీ గోవా బ్యూటీ ఇలియానా మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ యంగ్ హీరోయిన్స్ కి కూడా పోటీ ఇస్తుంది. లవ్ లో ఉండగా సినిమాలని తగ్గించిన ఇలియానా, బ్రేక్ అప్ అయ్యాక మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తుంది. ఆఫర్స్ కోసం వెయిట్ చేసే గ్యాప్ లో కాలీగా ఎందుకు ఉండాలి అనుకుందో ఏమో కానీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పెడుతూ హల్చల్ చేస్తుంటుంది.

రీసెంట్ గా బ్లాక్ బికినీలో ఉన్న ఫొటోస్ పెట్టిన ఇలియానా, యూత్ లో హీట్ పెంచింది. అసలే బీచ్, లైట్ గా ఎండ… సన్ బాత్ చేస్తూ గోవా బ్యూటీ ఫొటోస్ పెడితే ట్రెండ్ అవకుండా ఎలా ఉంటాయి. ఈ ఫోటోస్ చూడగానే ఇలియానాలో అందం తగ్గలేదు అనని వాడు ఉండడు. ట్రెండ్ కి తగ్గట్లు అప్డేట్ అవుతున్న ఇలియానా, తెరపై కూడా కనిపించి అలరిస్తుందా అని ఇలియానా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ గోవా బ్యూటీ ఫోటోల నుంచి సిల్వర్ స్క్రీన్ పై కనిపించే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.