Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

ఆ వాల్మీకి రామాయణం రాస్తే… ఈ హరీశ్ శంకర్ వాల్మీకీనే కొత్తగా రాశాడు…

1 min read

రీమేక్ కథలకి హరీశ్ శంకర్ కి ఏదో అనుబంధం ఉన్నట్లు ఉంది. అందుకే అతని చేతిలో పాత కథ పడిన కొత్తగా కనిపిస్తుంది, అందులోని ప్రతి డైలాగ్ కొత్తగా వినిపిస్తోంది. దబాంగ్ రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ టైటిల్ కార్డ్స్ లో మార్పులు మాటలు అనే కార్డ్ వేసుకున్నాడు అంటేనే తనలోని రైటర్ పై హరీశ్ శంకర్ కి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. గబ్బర్ సింగ్ బాటలోనే నడుస్తూ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ రీమేక్ వాల్మీకి. కోలీవుడ్ హిట్ ఫిల్మ్ జిగర్తండ సినిమాకి తెలుగు వెర్షన్ గా రెడీ అవుతున్న ఈ సినిమాలో మెగాహీరో వరుణ్ తేజ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటి వరకూ ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వాల్మీకి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మంచి ఫామ్ లో వరుణ్ తేజ్ లాంటి వాడిని విలన్ పాత్రలో చూపించి ప్రేక్షకులని కన్విన్స్ చేయడం కష్టం. అందుకే హరీశ్ శంకర్ వాల్మీకి సినిమాకి కొత్త ప్లాన్ వేశాడు. జిగార్తండ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించిన బాబీ సింహకి వరుణ్ కి ఇమేజ్ లో చాలా తేడా ఉంది. ఇది అందరికన్నా ముందే గుర్తించాడు కాబట్టే హరీశ్ శంకర్, వాల్మీకి సినిమాలో వరుణ్ కి 90ల్లో జరిగే ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి అందులో పూజ హెగ్డే లాంటి అమ్మాయిని శ్రీదేవిని చేసి ఒక లవ్ స్టోరీ డిజైన్ చేశాడు. ఆ ఎపిసోడ్ తో వరుణ్ రౌడీ అవడానికి కారణాలు చూపిస్తూ, లీడ్ పెయిర్ పైన రెడీ చేసిన లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ ట్రైలర్ లో చూడొచ్చు. యంగ్ లుక్ లో వరుణ్ చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. శ్రీదేవి పాత్రలో పూజా కూడా ట్రెడిషనల్ గా కనిపిస్తూనే గ్లామర్ గా ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ముకుంద తర్వాత పూజని ఇంత ట్రెడిషనల్ గా చూడడం ఇదే మొదటసారి. మరో లీడ్ పెయిర్ గా కనిపిస్తున్న అథర్వా మురళి, మిర్నలిని కూడా చాలా బాగున్నారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రజెంట్ జనరేషన్ లుక్ లో వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ గా చాలా వేరియేషన్స్ చూపించాడు. అతని లుక్ అండ్ స్మైల్ లోనే విలనిజం ఉంది, దాన్నే సరిగ్గా గమనిస్తే అందులోనే హీరోయిజం కూడా ఉంది. వరుణ్ నోటి వెంట పలికిన ప్రతి డైలాగ్ చాలా బాగుంది. ముఖ్యంగా గీతలు మాత్రమే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు… మనం బ్రతికున్నం అనే విషయం పది మందికి తెలియక పోతే ఆ బ్రతుకు ఎందుకు… లాంటి డైలాగ్స్ హీరోయిజాన్ని ఎలివెట్ చేస్తూనే ఆలోచించేలా ఉన్నాయి. ట్రైలర్ లో వచ్చిన మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి ట్రైలర్ లో వచ్చిన డైలాగ్ రేంజులో చెప్పాలి అంటే, ఆ వాల్మీకి రామాయణం రాస్తే ఈ హరీశ్ శంకర్ మాత్రం వాల్మీకి కథనే కొత్తగా రాశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.