Sat. Nov 16th, 2019

Sambashana

Online News Portal

దేశం కోసం ఆడే అందరూ సమానమే…

1 min read

ఆట ఏదైనా ఆటగాడు ఎవరైనా కానీ దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచేది ఎప్పుడూ గొప్ప విషయమే. అయితే కొంతమంది మాత్రం ఒకరిని పొగిడే పనిలో పడి ఇంకొకరిని మర్చిపోతున్నారు. దేశం కోసం ఎంతో కష్ట పడినా గుర్తింపు రాని వారిలో హీమా దాస్ ఒకరు. పీవీ సింధు ఒక్క గోల్డ్ మెడల్ సాధిస్తేనే ప్రతి ఒక్కరూ ఆమెని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. సింధు సాధించిన ఘనత గొప్పదే, నిస్సందేహంగా సింధు దేశ ప్రతిష్టను పెంచింది. మరి గోల్డ్ మెడల్ సాధించిన సింధు అంత గొప్ప అయితే మరి కేవలం 18 రోజుల వ్యవధిలోనే మన దేశానికి 5 గోల్డ్ మెడల్స్ తెచ్చిన హీమ దాస్ ఎంత గొప్ప అయ్యుండాలి. ఆమెకి ఎందుకు గుర్తింపు, గౌరవం లభించలేదు. ఏ హీమదాస్ మన దేశం క్రీడాకారిణి కాదా లేక ఆమె మన దేశం తరఫున ఆడలేదా? పోనీ హీమ తెచ్చిన స్వర్ణంలో కల్తీ ఉందా? తప్పు ఎక్కడ జరిగింది? ఎందుకు ఆమెని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? దేశం విషయానికి వస్తే ఏ ఆట అయినా ఒక్కటే… ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు… ఎవరూ తక్కువా కాదు… ఇది ప్రభుత్వాలు ప్రజలు గుర్తు పెట్టుకోని క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఇవ్వనంత వరకూ మనకి నాణ్యమైన ప్లేయర్స్ రారు…

2 thoughts on “దేశం కోసం ఆడే అందరూ సమానమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.