Wed. Feb 19th, 2020

Sambashana

Online News Portal

సూపర్ స్టార్ విత్ లేడీ సూపర్ స్టార్… రిపీట్ మోడ్

1 min read
nayan rajini

పేట, దర్బార్ హిట్స్ తో మంచి ఊపుమీదున్న రజినీకాంత్, అదే స్పీడ్ లో నెక్స్ట్ సినిమాని కూడా మొదలుపెట్టాడు. సిరుత్తై శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరిలో కీర్తి సురేష్ మెయిన్ ఫిమేల్ లీడ్, మిగిలిన ఇద్దరూ స్పెషల్ రోల్స్ అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తూ సన్ పిక్చర్స్ ఉహించని అనౌన్స్మెంట్ ఇచ్చింది.

తలైవర్ 168లో హీరోయిన్ గా నయనతారని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చంద్రముఖిలో స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్, రీసెంట్ గా దర్బార్ తో సూపర్ హిట్ ఇచ్చే వరకూ సాగింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్, లేడీ సూపర్ స్టార్ విత్ సూపర్ స్టార్… రిపీట్ అవుతుండడంతో రజినీ ఫ్యాన్స్ అండ్ నయన్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ హిట్ పెయిర్, మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.