Mon. Jan 27th, 2020

Sambashana

Online News Portal

సంక్రాంతికి మొగుడు మాములుగా రాడు…

1 min read
sarileru neekevvaru censor

ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు… ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు… సరిలేరు నీకెవ్వరూ టీజర్ సమయంలో అనీల్ రావిపూడి ఏ టైంలో ఈ డైలాగ్ రాశాడో తెలియదు కానీ 2020 సంక్రాంతికి మహేశ్ బాబు నిజంగానే బాక్సాఫీస్ మొగుడయ్యేలా ఉన్నాడు. పోస్టర్స్, టీజర్ నుంచి సాంగ్స్ వరకూ సరిలేరు నీకెవ్వరూ టీం రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ మహేశ్ అండ్ టీం ఫుల్ స్వింగ్ లో ప్రొమోషన్స్ ని చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండంతో, మేకర్స్ ఘట్టమనేని అభిమానులకి స్పెషల్ న్యూస్ చెప్పారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. అక్షరాలా రెండు గంటల నలభై ఏడు నిమిషాల డ్యూరేషన్ తో ప్రేక్షకుల ముందుకి రానున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాకి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 1 నేనొక్కడినే తర్వాత మహేశ్ సంక్రాంతికి రావడం ఇదే మొదటిసారి. 2014లో సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ రిజల్ట్ మహేశ్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతి బరిలో దిగుతున్న మహేశ్, బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి సిద్దమయ్యాడు. ఆరేళ్ల లెక్కని మహేశ్ సరి చేస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.