Mon. Jan 27th, 2020

Sambashana

Online News Portal

ఒక్క సినిమా కోసం ఎన్టీఆర్ అంత రిస్క్ చేస్తాడా?

1 min read
ntr

సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ ని యంగ్ టైగర్ గా చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి, ఆ తర్వాత అదే ఎన్టీఆర్ ని యముడిగా చూపించాడు. తాతని గుర్తు చేస్తూ ఎన్టీఆర్, యంగ్ యముడిగా నట విశ్వరూపమే చూపించాడు. నరలోకంలో ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్తుంటే, భూలోకంలో థియేటర్స్ దద్దరిల్లాయి. ఆ రేంజులో చేసిన ప్రతి సినిమాలో ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా భారీ రిస్క్ చేస్తున్నాడట. ఇప్పటికే దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్నాడు.

మూడు సినిమాల్లో ఎన్టీఆర్ కి చాలా కొత్తగా ప్రెజెంట్ చేసిన జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ లో కూడా తారక్ ని కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడట. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ లో గుండులో కనిపిస్తాడని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇందులో ఎంత వరకూ నిజముందో తెలియదు కానీ… టైటిల్ అనౌన్స్మెంట్ టైంలో విడుదల చేసిన పోస్టర్ లో తారక్ జుట్టుతోనే కనిపించాడు. కొమరం భీం తల పాగా కట్టుకుంటాడు.. సో గుండు ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదు కానీ… ఆర్ ఆర్ ఆర్ అయిపోయిన వెంటనే, తారక్… త్రివిక్రమ్ తో కొత్త సినిమా మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి రాజమౌళి ఎన్టీఆర్ కి గుండు చేయించే అంత సాహసం చేసే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.