Wed. Feb 19th, 2020

Sambashana

Online News Portal

మరిన్ని వివరాల కోసం స్టే ట్యూన్డ్ టు గబ్బర్ సింగ్ ఛానెల్

1 min read
pawan kalyan harish shankar gabbar singh

సినిమాలకి దూరమై రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఏడాది తర్వాత పింక్ రీమేక్ తో రీఎంట్రీ అనౌన్స్ చేసేశాడు. 26వ సినిమా శ్రీరామ్ వేణుతో సెట్స్ పైకి తీసుకెళ్లిన పవర్ స్టార్… ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే క్రిష్ తో సినిమా అనౌన్స్ చేసేశాడు. ఈ ఇద్దరు సాఫ్ట్ డైరెక్టర్స్ కావడం, పింక్ రీమేక్ ఏమో ప్రయోగాత్మక కథ కావడంతో… రీఎంట్రీ ఇంత సాఫ్ట్ గా ఉండబోతుందా అనిపించింది కానీ అసలైన అనౌన్స్మెంట్ ఇప్పుడు బయటకి చెప్తున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే ట్వీట్ చేశారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వచ్చిన ఈ అనౌన్స్మెంట్ ప్రతి మెగా అభిమానిని కదిలించి ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమా గురించి అందరూ చెప్పే ఉంటారు కానీ, దాని ఇంపాక్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేద్దాం.

పదేళ్లపాటు ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని హిట్ బాట పట్టించిన సినిమా గబ్బర్ సింగ్. చప్పగా అయిపోయిన మెగా అభిమానులకి కొత్త జోష్ ని ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. పవర్ స్టార్ అభిమానుల దశాబ్ద నిరీక్షణకి తెరదించిన సినిమా గబ్బర్ సింగ్. ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అనుకుంటున్నాడో లో చూపించిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ పోలీస్ అవతారం ఎత్తితే, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా గబ్బర్ సింగ్. టైం అయిపొయింది అన్న హీరో, బాక్సాఫీస్ రికార్డులని దున్నేస్తే ఎలా ఉంటుందో చూపించిన సినిమా గబ్బర్ సింగ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది కదరా మా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని ప్రతి ఒక్కడితో అనిపించిన సినిమా గబ్బర్ సింగ్. 2012లో వచ్చిన ఈ మూవీ, అప్పటివరకూ ఉన్న ప్రతి బాక్సాఫీస్ రికార్డుని తిరగరాసింది.

రెండే సినిమాల అనుభవం ఉన్న హరీష్ శంకర్, పదేళ్ల కష్టాన్ని తీర్చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఇంకో పదేళ్లు అయినా పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే గుర్తొచ్చే ఏకైక మూవీ గబ్బర్ సింగ్. మరోసారి పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో సినిమా చేస్తే చూడాలని ప్రతి అభిమాని అనుకున్నాడు కానీ… అజ్ఞాతవాసి తర్వాత పవన్ సినిమాల నుంచి దూరం అవడంతో, ఇక ఈ కాంబినేషన్ ని చూడడం కష్టం అనుకున్నారు.

పింక్ రీమేక్ తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, 28వ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉంటుంది అంటూ మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. వివరాలు మళ్లీ చెప్తాము, అప్పటివరకూ చూస్తూనే ఉండండి గబ్బర్ సింగ్ ఛానెల్ అనే రేంజులో వచ్చిన అనౌన్స్మెంట్… సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ రోజు కోసం ఎదురు చూసిన ప్రతి అభిమాని పండగ చేసుకోండి. మరిన్ని వివరాలు చెప్పే వరకూ గబ్బర్ సింగ్ డైలాగులని రిపీట్ మోడ్ లో వినండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.