Tue. Feb 18th, 2020

Sambashana

Online News Portal

అంధకారమా? అదేలా సాధ్యం

1 min read

ఆంధ్రప్రదేశ్… రాజధాని లేని రాష్ట్రంగా విడిపాయిన తర్వాత మొదటిసారి టీడీపీ అధికారం లోకి వచ్చింది. రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొత్త రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రజలకి సర్ప్లస్ పవర్ సప్ప్లై చేస్తే, ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ కోతల మాటే ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా రాష్ట్రమంతా కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే సరిగ్గా ఆరు నెలల క్రితం వరకూ 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రంలో ఉన్నపళంగా అంధకారం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. తెలంగాణలోనే సరిగ్గా విద్యుత్తు లేకపోతే ఏపీ సీఎం, తెలంగాణ నుంచి కరెంట్ ని కొనుక్కోవడం హాస్యాస్పదం.

పోనీ రాష్ట్రంలో నిజంగానే విద్యుత్ కొరత ఉంది అనుకుందాం, ఇది ముందే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదా? గుర్తిస్తే ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? బొగ్గు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో అధికారులు ఉన్నారా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎప్పటికీ ఎవరి నుంచి వినిపించవు అనే మాట నిజం.సర్ప్లస్ పవర్ నుంచి కరెంట్ కొన్నుకునే వరకూ ఎదిగిన ఏపీ నిజంగా దేశం గర్వించే అంత గొప్ప అభివృద్ధి పదంలో నడుస్తోంది. రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటకి తీసుకురావడానికి కరెంట్ కొనుక్కుంటే కొనుక్కున్నారు కానీ యూనిట్ మరీ 11 రూపాయలు అంటే ఎలా సారూ? కాస్త ఏ నాలుగు రూపాయలకు, అయిదు రూపాయలకో కొనండి.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మహానది కోల్ మైన్స్ లో టన్ను ధర రూ.1600కే దొరుకుతుంది అని చెప్పారు అక్కడ కొనే ప్రయత్నం చేయండి. లేదు మేము ప్రతిపక్షాల మాట వినుము అనుకుంటే మీకు నచ్చిన తెలంగాణ నుంచే పవర్ కావాలి అనుకుంటే సింగరేణిలో టన్ను రూ.3,700 పెట్టి కొనండి. మిమ్మల్ని అడిగే వాళ్లు మాత్రం ఎవరున్నారు చెప్పండి. మీకు పవర్ ఇచ్చిన ప్రజలకి కాస్త పవర్ ఇవ్వండి చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.