Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

సాహో @ 400 క్రోర్ క్లబ్… కానీ

1 min read

ప్రభాస్ రోజురోజుకీ తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. నెగటివ్ టాక్ వచ్చినా కూడా సాహో సినిమా మంచి వసూళ్లు రబడుతునే ఉంది. అయితే నార్త్ లో మాత్రమే ఆ హవా కొనసాగడం మిగిలిన ఏరియాల్లో నిరాశ పరచడం ట్రేడ్ వర్గాలని ఇబ్బంది పెడుతున్న విషయం. నార్త్ లో బ్రేక్ ఈవెన్ రీచ్ అయిన సాహో సినిమా హిందీలో 130కోట్ల నెట్ రాబట్టింది. తెలుగులో మాత్రం 80 కోట్లు మాత్రమే రబట్టగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేరాలంటే మరో 40 కోట్లు అయినా కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సాహో సినిమా అంత వసూళ్లు చేయడం కష్టంగానే కనిపిస్తుంది. మరో వైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సాహో పరిస్థితి పెద్ద గొప్పగా ఎమీ లేదు. అక్కడ సాహో దారుణమైన నష్టాలను మిగిల్చే ప్రమాదం ఉంది. అలాగే ఓవర్సీస్ లో మూడు మిలియన్ క్లబ్ లో సాహో చేరింది కానీ అక్కడ మూవీని 6 మిలియన్ డాలర్లకు అమ్మారు. మహా అయితే లాంగ్ రన్ లో సాహో ఇంకో మిలియన్ రబట్టగలదు, ఎలా చూసినా అక్కడ కూడా ప్రభాస్ సినిమా లాస్ వెంచర్ గానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రిలీజ్ కి ముందు సాహో ప్రమోషన్స్ ని అన్నీ తానై చూసుకున్న ప్రభాస్, మరోసారి బయటకి వచ్చి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా చేస్తే ఈ నష్టాలు కాస్త తగ్గే అవకాశం ఉంది… లేదంటే 400 కాదు 450 కోట్లు రాబట్టినా కూడా సాహో లాస్ వెంచర్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.