Mon. Jan 27th, 2020

Sambashana

Online News Portal

బలం వదిలి యుద్ధం చేయడానికి సిద్దమైన ప్రభాస్

1 min read
prabhas jaan

బాహుబలిలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ చేసిన యాక్షన్ ఇండియన్ మూవీ లవర్స్ ని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా బాహుబలి2 క్లైమాక్స్ లో రానా, ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా హిట్ కాకపోయినా.. ఇందులోని యాక్షన్ మాత్రం హాలీవుడ్ సినిమాలని మించి ఉందని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో వచ్చిన సాహో, రిజల్ట్ తేడా కొట్టింది. దీంతో ప్రభాస్ యాక్షన్ కో దండం అంటున్నాడు. రాధాకృష్ణ సినిమా లో ప్రభాస్ డీసెంట్ గా లవర్ బాయ్ లా కనిపించనున్నాడు. అయితే జాన్ అనే సాఫ్ట్ టైటిల్ పెట్టిన తర్వాత యాక్షన్ సైడ్ పోకుండా, కథపైనే ఎక్కువ ద్రుష్టి పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

డార్లింగ్ సినిమా ఫార్మాట్ లోనే, కథకి తగ్గట్లు… ఒకటి లేదా రెండు ఫైట్స్ పెడితే చాలని ప్రభాస్ కూడా ఫీల్ అవుతున్నాడట. జాన్ సినిమా అంతా లవ్ అండ్ ఎమోషనల్ జర్నీ గానే సాగుతుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా అప్సెట్ అవ్వరు అని రెబల్ స్టార్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. యాక్షన్ సినిమా కోసం వెయిట్ పెరిగిన ప్రభాస్, జాన్ లో లవర్ బాయ్ ఇమేజ్ కోసం బరువు తగ్గి స్లిమ్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా జరిగిన మత్తు వదలరా ఇంటర్వూలో ప్రభాస్ తగ్గి కనిపించాడు. అయితే జాన్ పీరియాడికల్ సినిమా కావడం, భారీ బడ్జట్ అవసరమయ్యే అవసరమవుతుంది. ఇలాంటి సమయంలో యాక్షన్ లేకుండా పాన్ ఇండియా అభిమానులని అలరించడం రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సాహో రిజల్ట్ తేడా కొట్టినా, హిందీలో కాసుల వర్షం కురిపించాడానికి కారణం యాక్షన్ సన్నివేశాలే, ఇప్పుడు జాన్ లో అవి లేకుంటే… ప్రభాస్ బలం వదిలి యుద్ధం చేయడానికి వెళ్తున్నట్లే. మరి ఈ కొత్త యుద్ధంలో ప్రభాస్ గెలుస్తాడో… లేదో తెలియాలి అంటే 2020 ఎండింగ్ వరకూ ఆగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.