Sat. Nov 16th, 2019

Sambashana

Online News Portal

Say “NO” to “FirstDayReview”

1 min read

రివ్యూ… ముందు నుంచి మేము చెప్తున్నట్లు ఏ సినిమాకి అయినా రివ్యూ అనేది ఆ చిత్రం విడుదలైన రెండు రోజుల తర్వాతే ఇవ్వాలి. ఇండస్ట్రీ నుంచి కూడా సినిమా రివ్యూ కాస్త లేట్ గా ఇవ్వమని అడిగిన వారిలో అల్లు అరవింద్, ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కొన్ని సైట్స్ అండ్ యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం సినిమా ప్రీ-రివ్యూ, లైవ్ అప్డేట్స్, ఓవర్సీస్ రివ్యూ, ట్విట్టర్ రివ్యూ, మొదటి షో పడే సరే సినిమా రివ్యూ… ఇలా చెప్పుకుంటూ పోతే యావరేజ్ సినిమాని కూడా చంపేసే మార్గాలు ఎన్నో…

నిజానికి ఈ పరిస్థితికి కారణం ఏ వెబ్సైట్, ఏ యూట్యూబ్ ఛానల్ కాదు… రివ్యూస్ సినిమాని డిసైడ్ చేసే స్థాయికి వచ్చాయి అంటే వాటికి కారణం ప్రొడక్షన్ హౌస్ లు. రివ్యూల కారణంగా సినిమాలు చచ్చిపోతున్నాయి అనేది మీరే, రెండు రోజులు ఆగి రివ్యూ ఇవ్వండి అని అడిగేది మీరే, మొదటి రోజు పాజిటివ్ రివ్యూస్ రాస్తే వాటిని షేర్ చేసి ప్రమోట్ చేసుకునేది మీరే. పాజిటివ్ రివ్యూ అయితే కావాలి, నెగటివ్ రివ్యూ అయితే మాత్రం వద్దు అంటారు సినిమాలు చచ్చిపోతున్నాయి రెండు రోజుల తర్వాత రివ్యూ ఇవ్వండి అంటారు. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా రివ్యూ, రివ్యూనే… సో ముందు ఇండస్ట్రీ వర్గాలు మొదటి రోజు పాజిటివ్ రివ్యూ రాగానే ఏ సైట్ ఎంత రేటింగ్ ఇచ్చిదంటూ పోస్టర్స్ డిజైన్ చేసి వేయకుండా దయ చేసి వెయిట్ చేయండి. రివ్యూ రెండు రోజుల తర్వాతే రాయమని డిమాండ్ చేయండి అప్పుడే సినిమా బ్రతికి బట్టకడుతుంది.

సింపుల్ గా చెప్పాలి అంటే నిన్న సాహూ సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు 95% పాజిటివ్ వైబ్ ఉన్న ఈ సినిమా, నిన్న మార్నింగ్ షో కూడా పడకముందే రివ్యూస్ బయటకి రావడంతో నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి సినిమాకి చాలా నష్టం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు సాహో కలెక్షన్స్ బాగుండొచ్చు కానీ స్ప్రెడ్ అయిన నెగిటివిటీ వళ్ల కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించే ప్రమాదం ఉంది. 350 కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన సాహూకి జరగబోయే నష్టానికి కారణం ఎవరో మీరే ఆలోచించుకోండి? సినిమాని చూసి దాని తలరాతని డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకుడు మాత్రమే వాడికి నచ్చితే ఎవరు ఏమన్నా సినిమా ఆడుతుంది, వాడికి నచ్చకుంటే ఎవరు ఎంత గొప్పగా చెప్పినా సినిమా ఆడాదు. అలంటి ప్రేక్షకుడిని థియేటర్ వరకు కూడా రానివ్వకుండా రివ్యూస్ ఆడ్డుపడుతున్నాయి. దయచేసి ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికైనా ఒక మాట మీద నిలబడి ఫస్ట్ డే రివ్యూస్ ని బ్యాన్ చేస్తే సినిమాలు బ్రతుకుతాయి, సినిమాలపై ఆధారపడి ఉన్న బ్రతుకులూ బాగుంటాయి.

8 thoughts on “Say “NO” to “FirstDayReview”

  1. Hey superb websitе! Does rinning a bⅼog such аs this require a mаssive amoynt work?
    I have no knowledge of coɗing bbut I had been hoping tto start my
    own blog soon. Anyhow, shoulⅾ you have any recommendatіons
    oг tis for new bloog oѡners please share.
    I know this is off topiⅽ ƅut I simply had
    tto ask. Cheerѕ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.