Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

రీమేక్ కథలు ఒకే… సొంత కథ ఎప్పుడు?

1 min read

రీమేక్ కథలకే కొత్త హంగులు అద్ది ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న హరీశ్ శంకర్, స్వతహాగా మంచి రైటర్… గతంలో మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి మూవీస్ కూడా తీశాడు కానీ దువ్వాడ జగన్నాథం సినిమాతో డీలా పడి… సొంత కథని రాసుకోవడం మానేశాడు. ఒకవేళ హరీశ్ శంకర్ మంచి కథని రాసుకున్నా కూడా నిర్మాతలు అతన్ని నమ్మి ప్రాజెక్ట్ చేతిలో పెట్టలేదు. మధ్యలో యంగ్ హీరోలతో ఒకటి రెండు సినిమాలు అనుకున్నా అవేమి సెట్ కాలేదు. అందుకే దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయినా హరీశ్ శంకర్ నుంచి సినిమా బయటకి రాలేదు. దీంతో చేసేదేమి లేక మళ్లీ రీమేక్ బాటపట్టిన డైరెక్టర్ వాల్మీకీతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు కానీ తన సొంత కథతో ఎప్పుడు హిట్ అందుకుంటాడు అనే విషయం అర్ధం కావట్లేదు. గబ్బర్ సింగ్ కి కొంచెం తిక్కుంది,దానికో లెక్కుంది అనే మాస్ డైలాగ్ కానీ… మధ్య తరగతి కుటుంబంలోని తండ్రికి కొడుకు ప్రేమ కన్నా, కూతురి పెళ్లే ముఖ్యం అనే హార్ట్ టచింగ్ డైలాగ్ కానీ ఎలాంటి సన్నివేశానికైనా మాటలు రాయగల సమర్ధుడు హరీశ్ శంకర్… గబ్బర్ సింగ్ లాంటి రీమేక్ సినిమాకి మాటలు మార్పులు హరీశ్ శంకర్ అనే టైటిల్ కార్డ్ వేసుకునే డేర్ చేశాడంటే, అతని రైటింగ్ పై హరీశ్ శంకర్ కి ఎంత నమ్మకమో అర్ధమవుతుంది. ఇంతటి టాలెంటెడ్ రైటర్ సొంత కథ రాసుకోలేకపోతుండడం బాధాకరం. ఇప్పుడు వాల్మీకీ ట్రైలర్ చూస్తుంటే హరీశ్ శంకర్ మరోసారి హిట్ అందుకేనేలాగే ఉన్నాడు. అదే జరిగితే అతనిపై రీమేక్ డైరెక్టర్ అనే ముద్రపడే అవకాశం ఉంది. ఈ మచ్చ నుంచి హరీశ్ శంకర్ ఎలా బయటకి వస్తాడు? ఎప్పుడు బయటకి అనేది అర్ధం కాని విషయం. పైగా హరీశ్ శంకర్ నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ రీమేక్ అనే వార్త వినిపిస్తోంది. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా కూడా రీమేక్ చిత్రమే కాబట్టి హరీశ్ ఇప్పటిలో సొంత కథకి తన కలం పదును చూపించేలా లేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.