Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

ఒక్క రోజు దేశభక్తి

1 min read

నేను దేశం కోసం రాసిన కథలు చదివాను, దేశభక్తిపై రాసిన పాటలు విన్నాను కానీ దేశాన్ని మాత్రం చూడలేదని ఒక రచయిత రాసింది అక్షర సత్యం. ఇక్కడ ఉన్న 120కోట్ల ప్రజలకి దేశ అంటే చాలా ఇష్టం కానీ అది ఆగష్టు 15, జనవరి 26న మాత్రమే గుర్తొస్తోంది. ప్రతి మనిషికీ దేశభక్తి ఎక్కువ కానీ అది ఇండియా పాకిస్థాన్ మధ్య గొడవ జరిగినప్పుడో, ఎవరైనా మన దేశాన్ని తిట్టినప్పుడో మాత్రమే గుర్తొస్తుంది. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా సో క్లాడ్ దేశ భక్తులు ఘనంగా జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవం వచ్చింది. ఎప్పటిలాగే మళ్లీ అందరికీ ఇండియాపైన ప్రేమ పుట్టుకొచ్చింది.

ప్రతి భారతీయుడు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, తెల్ల బట్టలు వేసుకోని మూడు రంగుల మువ్వన్నెల జెండాని చిన్న గుండు సూది సాయంతో గుండెపై తగిలించుకోని దేశ భక్తి పాటలు పాడుకుంటూ తిరుగుతుంటాడు. దేశభక్తి పేరుతో ఒక్కటైన మనుషులు, జండా వందనం అయిపోగానే మళ్లీ మాములు మనుషులు అయిపోతారు, వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పెరుగుతుంది. మాయం అయిన కులమత గోడలు మళ్లీ కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆగష్టు 14 అర్ధరాత్రి 12గంటలకి మర్చిపోయిన ప్రతి విషయం ఆగష్టు 15 మధ్యాహ్నం 12 గంటలకి గుర్తొచ్చేస్తుంది. దేశభక్తి మాయమవుతుంది… మనుషులు మాత్రమే మిగులుతారు. అందుకే మనది ఒక్కరోజు దేశభక్తి.

అంతెందుకు ఆగష్టు 15న గుండెపై ఎంతో గర్వంగా పెట్టుకున్న జెండా, రేపు రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడున్నా, అదే రోడ్డుపై బండ్లు తొక్కుతున్నా… ఆఖరికి కాళ్ల కింద నలుగుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో మనుషులు ఉండరు. మరి ఎక్కడ ఉంది దేశభక్తి, ఎందులో ఉంది దేశభక్తి? ఆగష్టు 16న రోడ్డు పక్కన పడున్న జెండాని తీయని ఏ ఒక్కడికీ ఆగష్టు 15 జెండా వందనం చేసే అర్హత లేదు, దేశభక్తి గురించి మాట్లాడే స్థాయి లేదు. అందుకే మీలోని ఒక్కరోజు దేశభక్తుడిని మేల్కొల్పకుండా ఈ రోజు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వండి… ఎప్పటిలాగే మీ పనులు చేసుకోండి. అదే అందరికీ మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.