Sat. Sep 14th, 2019

Sambashana

Online News Portal

అది జనసేన పతనానికి పునాది!

1 min read

2019 ఎన్నికల ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఏపీలో ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు, ఉత్తరాదిన జెండా ఎగరేసి కేంద్రంలో పాగా వేసిన బీజేపీ ఆంధ్రలో డిపాజిట్లు కూడా రాబట్టలేకపోయింది. మరో వైపు బలంగా వీసిన ఫ్యాన్ గాలి ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ కూడా సరిపోలేదు. స్వయానా జనసేననే పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడంటే రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కష్టం నుంచి పార్టీని బ్రతికించాలని చూస్తున్న పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళిక రచిస్తున్నాడు. ఇదే సమయంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష హోదాపై కన్నేసిన బీజేపీ, అందుకు తగ్గట్లు పావులు కదుపుతోంది. టీడీపీ స్థానంలోకి బీజేపీ రావాలంటే, రాష్ట్రంలో వారికి బలమైన అండ కావాలి. అందుకే వారు వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ని సీఎం కాండిడేట్ గా అనౌన్స్ చేసి జనసేన పార్టీలో బీజేపీలో విలీనం చేసుకోవాలనేది ఆ పార్టీ ప్లాన్ అయితే అందుకు పవన్ ఒప్పుకునేలా కనిపించకపోవడంతో, ఈ పొత్తు అనే మాట బయటకి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన కలిస్తే అది పవన్ కళ్యాణ్ పార్టీ పతనానికి మొదటి అడుగు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీని అంగీకరించే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరు, అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయుడు…మోదీ రాష్ట్రానికి ఏమీ చేయలేదనే మాట ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు, అలాగే ఇప్పుడు కాస్త సైలెంట్ గా ఉన్న జగన్ కూడా వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రత్యేక హోదాకి ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదనే విమర్శని మళ్లీ ఆంధ్రప్రజల్లోకి తీసుకెళతాడు. సో ఎటు చూసినా బీజేపీ ఏపీకి సాయం చేస్తుంది అంటే ఆ మాట నమ్మే సిట్యుయేషన్ లో ప్రజలు లేరు, ఇది గ్రహించకుండా పవన్ కళ్యాణ్ వాళ్లతో పొత్తుకు పోతే మాత్రం… జనసేనని కార్నర్ చేస్తూ విమర్శలు చేయడానికి వైసీపీకి టీడీపీకి అతిపెద్ద కారణమే దొరికినట్లు అవుతుంది. 2019లో ఆరు శాతం ఓట్లు కూడా రాబట్టలేక పోయిన జనసేనని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి, బీజేపీతో పొత్తు లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఒంటరిగా ఎన్నికల్లో నిలవడమే జనసేన పార్టీ మనుగడకి మంచిది. మరి పవన్ కళ్యాణ్ కి తిక్కుంది, దానికో లెక్కుంది అంటారు కాబట్టి ఆయన పార్టీ భవిష్యత్తు కోసం లెక్కలు వేస్తాడో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.