Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

ఆ దే దే కి ఒక దండం…

1 min read
de de pyar de movie

ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్న విక్టరీ వెంకటేశ్, బాలీవుడ్ హిట్ మూవీ దే దే ప్యార్ దే సినిమాలో నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపించింది. వెంకీ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం వెంకీ దే దే ప్యార్ దే సినిమా చేయడంలేదని సమాచారం.

పెళ్లి వయసు కూతురున్న ఒక 45 ఏళ్ల వ్యక్తి, దాదాపు తన కూతురు వయసున్న అమ్మాయితో ప్రేమలో పడేతే ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్, టబు సూపర్ యాక్టింగ్ తో అలరించారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాని బాగానే ఆదరించారు కానీ తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి అల్ట్రా రొమాంటిక్ కథలను యాక్సెప్ట్ చేయరు. రీసెంట్ గా వచ్చిన మన్మథుడు-2 సినిమా కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. కథలో దమ్ము లేకపోవడం, రకుల్ అండ్ నాగార్జున పైన డిజైన్ చేసిన లవ్ ట్రాక్ కూడా బెడిసి కొట్టడంతో మన్మథుడు 2 ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమయింది.

venkatesh

ఈ రిజల్ట్ చూశాకే వెంకీ, రియలైజ్ అయ్యి దే దే ప్యార్ దే సినిమాని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. అయితే మన్మథుడు 2 సినిమాలో కథ లేదు, సరైన ఫన్ జనరెట్ అవలేదు. దే దే ప్యార్ దే సినిమా అలా కాదు, కథలోనే కావల్సినంత కామెడీ ఉంది. వెంకీ స్టైల్ కి, అతని వే ఆఫ్ కామెడీకి అది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కాబట్టి వెంకీ హిందీ సినిమా రీమేక్ లో నటిస్తే బాగుంటుంది. ప్యార్ దే సినిమాకు అవసరమైన తెలుగు నేటివిటీ జోడిస్తూ స్క్రిప్టులో మార్పులు చేసి దర్శకుడు శ్రీవాస్ షూటింగ్ కి రెడీగా ఉన్నాడు. మరి ఈ సినిమా ఉంటుందా, లేదా? ఉంటే హీరోగా వెంకటేశ్ చేస్తారా లేక మరో హీరో ఎవరైనా తనని రీప్లేస్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.