Wed. Feb 19th, 2020

Sambashana

Online News Portal

నిఖిల్ టైం మాములుగా లేదుగా…

1 min read
nikhil

ఏడాది డిలే అయినా అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ సిద్దార్థ్, మంచి జోష్ లో ఉన్నాడు. మూడు రోజుల్లో 12 కోట్లు రాబట్టిన అర్జున్ సురవరం సినిమా నిఖిల్ కి కావాల్సిన హిట్ ఇచ్చేసింది. దీంతో స్పీడ్ పెంచిన నిఖిల్ తన నెక్స్ట్ సినిమాలని లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే కార్తికేయ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసిన నిఖిల్, మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు.

నిఖిల్ కొట్టేసిన ఆ లక్కీ ఆఫర్ సుకుమార్ బ్యానర్ లో కావడం విశేషం. డైరెక్షన్ చేస్తూనే అప్పుడప్పుడూ కథలు రాస్తూ, సినిమాలని నిర్మించే సుకుమార్… మరోసారి ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడు. కుమారి 21F డైరెక్ట్ చేసిన సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలోనే రానున్న ఈ మూవీలో నిఖిల్ హీరోగా నటించనున్నాడు. గీత ఆర్ట్స్ ఈ మూవీ కో ప్రొడ్యూస్ చేయనుండడం విశేషం. సుకుమార్, గీత ఆర్ట్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి కాస్ట్ అండ్ క్రూలో స్టార్స్ ఉంటారు. మరి ఇప్పటివరకూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేసిన నిఖిల్ కి, ఇది కెరీర్ టర్నింగ్ సినిమా అవుతుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.