Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

బన్నీ త్రివిక్రమ్ లు ఆ క్లాత్ మాత్రం వదలట్లేదే…

1 min read
ala vaikuntapuramulo new poster

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాలోని ఫస్ట్ సాంగ్ సామజవరగమన బయటకి వచ్చి సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. 20మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట మాయ నుంచి బయటకి వచ్చే లోపు, దసరా కానుకగా కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. కొత్త లుక్ లో బన్నీ ఫార్మల్స్ లో స్టైలిష్ గా ఉన్నాడు. ఫైట్ సీక్వెన్స్ నుంచి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ బన్నీ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. చేతిలో ఒక రెడ్ క్లాత్ ని పట్టుకోని బన్నీ రౌడీలని ఇరగదీస్తున్నాడు. అయితే అది జస్ట్ రెడ్ లాగా కాకుండా ఎవరిదో చున్నీలాగా కనిపిస్తుంది. పోస్టర్ ని క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే బన్నీ బ్యాక్ గ్రౌండ్ లో కొందరు స్పోర్ట్స్ ప్లేయర్స్, వాలీబాల్ నెట్ ఉన్నాయి. ఒక గ్రౌండ్ లో అల్లు అర్జున్ ఎవరినో ఇరగదీస్తున్నాడు, మరి వాళ్లకి ఆ చున్నీకి ఉన్న సంబంధం ఏంటో? అసలు ఆ చున్నీ హీరోయిన్ పూజా హెగ్డేదా, లేక నివేదా పేతురేజ్ దా? అనేది తెలియాలి అంటే సంక్రాంతి వరకూ ఆగాలి.

ala vaikuntapuramulo new poster

ఈ పోస్టర్ చూస్తుంటే బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు గుర్తొస్తున్నాయి. జులాయి హీరో ఇంట్రడక్షన్ మేడ మీద బట్టలు తీసే సమయంలో ఉంటుంది. సన్నాఫ్ కృష్ణమూర్తిలో కూడా ఒక రెడ్ క్లాత్ ని కర్రకి కడుతూ బన్నీ ఒక డైలాగ్ చెప్తాడు. ఆ సినిమాకి ఆ డైలాగ్ కి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు అల వైకుంఠపురములో పోస్టర్ లో కూడా బన్నీ చేతికి త్రివిక్రమ్ రెడ్ క్లాత్ ఇచ్చాడు. మరి ఆ రెండు సినిమాల్లాగే అలా వైకుంఠపురములో కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.