Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

హ్యాట్రిక్ హిట్ బొమ్మ రెడీ అవుతోంది…

1 min read
ala vaikuntapuramulo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోల్డెన్ టైంని ఎంజాయ్ చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో సినిమా నుంచి బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ అయ్యింది. మెగా అభిమానులు మాత్రమే కాదు ప్రతి సినీ అభిమాని అల వైకుంఠపురములో సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ వైబ్ తో ఒక సినిమా రిలీజ్ కానుండడం ఇదే మొదటిసారి. ఇదే జోష్ లో అల వైకుంఠపురములో మేకర్స్ సెన్సార్ కి వెళ్లి అక్కడ నుంచి కూడా మంచి న్యూస్ బయటకి ఇచ్చారు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు… క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. త్రివిక్రమ్ సినిమాలకి క్లీన్ సర్టిఫికెట్ రావడం కొత్తేమి కాదు.

ఇదిలా ఉంటే జనవరి 6 అల వైకుంఠపురములో సినిమా ఆడియో కాన్సర్ట్ జరగబోతోంది. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కర్టైన్ రైజర్ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ తగ్గట్లే, చాలా క్లాస్ గా ఉన్న ఈ కాన్సర్ట్ కర్టైన్ రైజర్ వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఈవెంట్ కూడా ఇదే రేంజులో జరుగుతుందేమో చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.