Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

వర్మ అనౌన్స్మెంట్ కి… అమృత స్ట్రాంగ్ రిప్లై

1 min read
rgv amrutha murder

కరోనా టైములో ఇండస్ట్రీ వర్గాలంతా ఇంట్లో కూర్చుంటే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం వరస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్ అనే మూవీ తీసి ఓటిటీలో రిలీజ్ చేసి, చిన్న సినిమాలకి కొత్త మార్కెట్ ని పరిచయం చేసిన వర్మ, త్వరలో నేకేడ్ అనే మూవీతో మరోసారి డిజిటల్ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. కాంట్రవర్సీలని బాగా హ్యాండిల్ చేసే వర్మ, తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. వర్మకి సినీ రాజకీయ ప్రముఖుల లైఫ్ ఇన్సిడెంట్స్ అయినా.. శృంగార తరాల లైఫ్ హిస్టరీ అయినా.. ఎన్కౌంటర్ చేయబడిన వ్యక్తుల జీవితాలైనా.. గ్యాంగ్ స్టర్ జీవిత కథ అయినా ఆయనకు కథా వస్తువే. వాటిని సినిమాగా రూపొందించిన క్రమంలో ఎన్ని వివాదాలు చెలరేగినా తాను అనుకున్నది సిల్వర్ స్క్రీన్ మీద బయట పెట్టేస్తాడు. ఈ క్రమంలోనే వర్మ అనౌన్స్ చేసిన లేటెస్ట్ మూవీ, మర్డర్.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ మారుతీరావు, ఆయన కూతురు అమృత.. ప్రణయ్ ల కథతో వర్మ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో మారుతీ రావ్, కిరాయి గుండాని పెట్టి ప్రణయ్ ని హత్య చేయించాడు. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే లేపింది. ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత ఫైట్ చేసి, మారుతీ రావుకి శిక్ష పడేలా చేసింది. ఇటీవలే మారుతీ రావు ఆత్మహత్య చేసుకోని చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత అమృత మీడియాతో మాట్లాడిన తీరుతో సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఇదే కథతో వర్మ, మర్డర్ సినిమాని అనౌన్స్ చేశాడు. వర్మ సినిమా తీస్తున్నాడు అంటే కావాల్సినంత పబ్లిసిటీ చేసి, జరిగిన కథని ఎవరూ ఊహించని కోణం నుంచి చూపిస్తాడు. ఈ మర్డర్ లో మారుతీ రావుని పాజిటివ్ గా చూపిస్తాడా? లేక అమృత వైపు కథని చూపిస్తాడా అనేది తెలియదు కానీ… ఆర్జీవీ చేతిలో ఒక కథ పడితే, అది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించి చెప్పడం కష్టమే.

తమ కథతో వర్మ సినిమా చేస్తున్నాడు అనే వార్త తెలియగానే, అమృత “అంత మర్చిపోయి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నానని, ఇక తనకి పోరాడే శక్తి లేదని… వర్మ కూడా అందరిలాగే పేరు కోసం ఇంత నీచానికి దిగజారడాని” రెస్పాండ్ అయ్యింది. ఇవేమి పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ మాత్రం మర్డర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి, ఈ విషయంపై వరస ట్వీట్స్ చేస్తున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేయడం కొసమెరుపు. అయితే ఈ మర్డర్ సినిమాని రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు అనుకుంటే పొరపడినట్లే, ఈ మూవీని ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రలైన మారుతీరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తుండగా అమృత పాత్రలో సాహితి నటిస్తోంది.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.