Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

అన్నా క్యాంటీన్ రద్దు… వద్దు

1 min read

ప్రతి ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉంటుంది, వాటికి అనుగుణంగా ఆయా పార్టీలు పని చేస్తూ ఉంటాయి. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా, అధికారంలోకి రాగానే ముందున్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలని ఆపేస్తుంది. అధికార పార్టీ తమ ఉనికిని చాటుకునేందుకు ఇలా చేస్తుందా లేక ముందున్న పార్టీలు పెట్టిన పథకాలని కంటిన్యూ చేసినా తమకి ఉపయోగం లేదు అని ఆలోచిస్తుందో తెలియదు కానీ ఒక పార్టీ పెట్టిన పథకాలని మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాటించరు అనేది అక్షర సత్యం. వేరే పార్టీ పెట్టిన పథకాలని తాము ఎందుకు నడిపించాలి అనే ఆలోచనలో ఎంత వరకు తప్పుంది అనేది కాసేపు పక్కన పెడితే, కొన్నిసార్లు ప్రజల సంక్షేమం కోసం పుట్టిన కొన్ని ముఖ్యమైన పథకాలని ఆపేయడం మంచిది కాదు. ముఖ్యంగా మూడు పూటలా ఎంతో మందికి అన్నం పెట్టే అన్నా కాంటీన్ లాంటి వాటిని రద్దు చేయడం ప్రజల పొట్టకొట్టడమే. టీడీపీ హయాంలో మళ్లీ అధికారంలోకి రావాలనే కాంక్షతో ఈ పథకం పెట్టిందో లేక నిజంగానే పేద ప్రజలపై ప్రేమతో ఇలాంటి పథకం పెట్టిందో తెలియదు కానీ అన్న కాంటీన్ పథకం ఎంతో మందికి అన్నం పెట్టింది. గత కొంత కాలంగా వైసీపీ ఈ అన్న కాంటీన్ లని మూసేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారం, ఆధిపత్యం అనేవి కాస్త పక్కన పెట్టి వైసీపీ… ప్రజల గురించి అలోచించి ఈ అన్న కాంటీన్ లని నడిపిస్తే ఎంతో మందికి అన్నం పెట్టిన వారవుతారు. ఒకవేళ ఎన్టీఆర్ బొమ్మతో, ఆయన పేరుతోనే ఈ కాంటీన్ లని నడపడం ఇష్టం లేకపోతే… రాజన్న కాంటీన్ అనో, వైఎస్సార్ కాంటీన్ లో పేరు పెట్టి ఇలానే నడిపిస్తే పార్టీకి కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది… పది మంది కడుపూ నిండుతుంది. అధికారంలో ఉన్న వారు, ఇలాంటి విషయాల్లో కాస్త ప్రజల వైపు నుంచి కూడా అలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.