Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

ఈ నట సింహాన్ని బోయపాటి మాత్రమే సరిగ్గా వాడగలడు…

1 min read
Balakrishna 106 BB3

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా అభిమానులకి అదిరిపోయే సర్ప్రైజ్ బయటకి వచ్చింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి ఫస్ట్ రోర్ అంటూ బయటకి వచ్చిన ఈ స్పెషల్ టీజర్ అదిరిపోయింది. సింహా లెజెండ్ సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా, అంతకన్నా ఎక్కువ పవర్ ఫుల్ గా వచ్చిన ఈ టీజర్, చూసిన ప్రతి ఒక్కరితో జై బాలయ్య అనిపించేలా ఉంది.

థమన్ సూపర్ మ్యూజిక్ వస్తుండగా, పంచ కట్టి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ… ఇది కదరా బాలయ్య అంటే అనిపించేలా ఉన్నాడు. ఎప్పటిలాగే “ఎదుటి వాడితో మాట్లాడే పద్ధతి తెలుసుకో” అంటూ ఒక మాస్ ధమ్కీ ఇచ్చిన బాలకృష్ణ, ఎండ్ ఫ్రేమ్ మీసం తిప్పుతుంటే ఎవరైనా సరే… బాలయ్య అండ్ బోయపాటి ఈజ్ బ్యాక్ అనాల్సిందే. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఫస్ట్ రోర్ ని చూడగానే, నటసింహాన్ని బోయపాటి శ్రీను చూపించినట్లు ఎవడు చూపించలేరు అని ఒప్పుకోవాల్సిందే. నందమూరి అభిమానులు ఇప్పుడు మొదలెట్టండి అసలైన పండగ…

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.