Tue. Jul 7th, 2020

Sambashana

Telugu News Portal

ఎన్టీఆర్ గెలిచాడు, అభిమానులని గెలిపించాడు

1 min read
ntr birth day

16 ఏళ్ళకి హీరోగా ఎంట్రీ, 17వ ఏట మొదటి హిట్. 19 ఏళ్ళకి తెలుగు సిని చరిత్రని తిరగరాసే బాక్సాఫీస్ హిట్. 20 ఏళ్లు వచ్చే లోపు ఇండస్ట్రీని షేక్ చేస్తూ కొత్త సూపర్ స్టార్ బయటకి వచ్చాడు, ఎందరినో తన వైపు తిప్పుకోని అ స్టార్ ఇస్ బోర్న్ అనిపించేలా చేశాడు. అతని పేరే నందమూరి తారక రామారావు, నాలుగు దశాబ్దాల పాటు వెండితెర ఇలవేల్పుగా వెలిసిన ఆ పెద్దాయన గురించి కాదులేండి. ఆయన మనవడు చిన్న రామయ్య గురించి చెప్తున్నాం. పెద్దాయన సాధించింది మన ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ల నుంచి వినడమే కానీ చూసే అదృష్టం మనకి కలగలేదు. చిన్న ఎన్టీఆర్ గురించి మాత్రం చూడడమే కాదు చెప్పుకుంటున్నాం కూడా.

20 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ఏం చేశాడు అంటే… అభిమానుల అంచనాలని, యంటి ఫ్యాన్స్ విమర్శలని మోయలేక, ఏ కథ ఎంచుకోవాలో తెలియక వరస బెట్టి ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. ఇక అయిపొయింది ఎన్టీఆర్ పని అనుకున్నారు, కానీ తనని తానూ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు హిట్స్ ఇస్తూ వచ్చాడు. ఇంతేనా ఎన్టీఆర్ లాంటి నటుడి నుంచి కోరుకుంది ఇదేనా? ఈ హిట్స్ ఆ అభిమానులని సంతృప్తి పరుస్తాయా? లేదు ఎన్టీఆర్ లాంటి నటుడి నుంచి అందరూ కోరుకుంది హిట్స్ మాత్రమే కాదు, ఇంకేదో కావాలి, ఆ ఇంకేదో అనే పదానికి అర్ధం తెలుసుకునే లోపు ఎన్టీఆర్ కెరీర్ ఇక అయిపొయింది అనే మాట కూడా వినిపించడం మొదలయ్యింది.

తారక రాముని మనవడు, ఓటమిని అంతా ఈజీగా ఒప్పుకుంటాడా? నందమూరి బిడ్డా మజాకా… తన శక్తిని తానూ తెలుసుకోని, ఇతరులకి తెలియజేస్తూ… నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో మొదటిసారి కనిపించి, ఇది కదా ఎన్టీఆర్ నుంచి కోరుకుంది అనిపించేలా చేశాడు. అప్పుడు మొదటిసారి విమర్శకుల నోర్లు మూయిస్తూ ఎన్టీఆర్ మళ్లీ గెలిచాడు. టెంపర్ ఆడియో లాంచ్ లో చెప్పినట్లు అభిమానులని కూడా గెలిపించాడు. చెప్పి హిట్ కొట్టడం అంటే ఇదేనేమో, అప్పటివరకూ కేవలం హీరోగా కనిపించిన ఎన్టీఆర్, అక్కడి నుంచి పెను విస్పోటనంలా కనిపించాడు. తెరపై నిప్పులు చిమ్మడం ఆరంభం అయ్యింది. అయిదేళ్లు గడిచింది, ఆ పెను విస్పోటనం ఇంకా రగులుతూనే ఉంది. ప్రతి సినిమాతో ఎన్టీఆర్ గెలుస్తూనే ఉన్నాడు, అభిమానులని గెలిపిస్తునే ఉన్నాడు.

ఈ ఎన్టీఆర్ అనే విధ్వంసం రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ తో లావాలాగా వ్యాపించడానికి సిద్దంగా ఉంది. భవిష్యత్తులో కొమరం భీమ్ ఎలా ఉంటాడు అంటే మా ఎన్టీవోడిలా ఉంటాడు అని యావత్ భారతం గొంతెత్తి చెప్పేలా చేయబోతున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి మరెన్నో సూపర్ హిట్స్ ఇండస్ట్రీ హిట్స్ చూడబోతున్నాం. ఎన్టీఆర్ అఖండ భారత దేశ అభిమానులని గెలుచుకోబోతున్నాడు. నిలబడి నోడు గొప్పోడు అయితే పడిన తర్వాత కూడా లేచి నిల్చున్నోడు ఇంకా గోప్పోడు. ఇప్పుడు మనం చూస్తుంది శాంపిల్ మాత్రమే, రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గెలిస్తే ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. టిల్ దెన్ కీప్ వెయిటింగ్…

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.