Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

జగన్ కి జర్క్ ఇచ్చిన బీజేపీ… ఏపీ సీఎం ఇప్పుడు ఏం చేస్తాడు?

1 min read

టీడీపీ హయాంలో మొదలైన పోలవరం పనులు అసలు ఎక్కడ వేసిన గింగలి అక్కడే ఉంది అన్న రీతిలో పునాదులు కూడా వేయలేదని విమర్శలు చేసిన ఏపీ సీఎం జగన్, అదే పోలవరం నుంచి స్పిల్ వే నుంచి నీళ్లు కూడా మళ్లించారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయాన్ని పెంచింది కాబట్టి వాటిని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ అనే కొత్త మాట అన్నారు. జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు అతన్నే ఇరకాటంలో పడేలా చేసింది.

పార్లమెంట్ లో 55000 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మాట్లాడిన గల్లా జయదేవ్, ఇచ్చిన మాటకి కట్టుబడి వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. గల్లా మాటలని ప్రశ్నలుగా తీసుకున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. పోలవరం అనేది నేషనల్ ప్రాజెక్ట్, దాని నిర్మాణ ఖర్చునంతా కేంద్రం భరిస్తుంది… అందులో భాగంగానే ఇప్పటి వరకూ జరిగిన 5వేల కోట్ల పనిలో 3వేల కోట్లకి ఆడిట్ జరిగిందని… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొత్తగా టెండర్లని పిలవడం కారణంగా పోలవరం ప్రాజెక్ట్ వ్యయం మరింత పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని తేల్చిచెప్పేశారు. దీంతో ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ కారణంగా విమర్శలు ఎదురుకుంటున్న జగన్ కి, గజేంద్ర సింగ్ షెకావత్ మాటలు మరింత గట్టిగా తగిలి ఉంటాయి. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ కి పిలిచి పోలవరం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఎంత పెంచుతారు? ప్రాజెక్ట్ ఇంకెన్నేళ్లు డిలే అవుతుంది? పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వెనక వైసీపీనే కారణమా అనే అనుమానం ప్రజల్లో కలిగేలా చేస్తుంది. మరి బీజేపీ ఇచ్చిన ఈ కౌంటర్ ని వైసీపీ అండ్ జగన్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.