Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

బీజేపీ ముందు శివసేన భారీ డిమాండ్, అంత రిస్కా?

1 min read
BJP Shiv Sena

మహారాష్ట్ర ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ ముందు శివ సేన మధ్య జరిగిన ఒప్పందం బయటకి వచ్చింది. ఎన్నికల కన్నా ముందే ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందంలో భాగంగా చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదనను శివసేన తీసుకొచ్చింది. దీని గురించి మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే… ఒప్పందం ప్రకారం పదవులు చేపడతాం, అయితే మొదటి రెండున్నర ఏళ్లు మాత్రం తాము సీఎం పదవిలో ఉండాలనుకుంటున్నామని చెప్పాడు.

BJP Shiv Sena

శివసేన డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకుంటే మాత్రం రెండు పార్టీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోనున్నాయి. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యే అవకాశం ఉండగా, శివ సేన నుంచి ఆదిత్య థాక్రేనే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలని శాసిస్తున్నా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నిలబడని థాక్రే కుటుంబం నుంచి మొదటిసారి బయటకి వచ్చిన ఆదిత్య, ప్రత్యర్థిపై 70 వేల మెజారిటీతో గెలిచాడు. ఆదిత్య సీఎం అయితే థాక్రే కుటుంబంలోనే కాదు 29 ఏళ్లకే సీఎం అయిన వ్యక్తిగా అతను కొత్త చరిత్ర సృష్టించిన వాడవుతాడు. అయితే ఎంత మాత్రం ఒప్పందంలో భాగమే అయినా, చావు తప్పి కన్ను లొట్ట పోయిన పరిస్థితిలో ఉన్న బీజేపీ… అధికారాన్ని తీసుకెళ్లి శివసేన చేతిలో, అది కూడా అనుభవం లేని యువకుడి చేతిలో పెడుతుందా అనేది ఆలోచించాల్సిన విషయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.