Tue. Mar 31st, 2020

Sambashana

Online News Portal

ఎంఐఎం పార్టీ సాయంతోనే బీజేపీ అధికారం?

1 min read
MIM BJP Shiva Sena

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీ-శివసేన కూటమినే గెలిపించారు. 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 స్థానాల్లో గెలిచింది. ఇందులో బీజేపీ గెలిచినవి 105 సీట్లు కాగా, శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకి మాత్రమే పరిమితం అయ్యింది పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి.

MIM BJP

నిజానికి గతంతో పోలిస్తే మహారాష్ట్రలో బీజేపీ ప్రభ కాస్త తగ్గింది. దాదాపు 40కి పైగా స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ గెలిచిన స్థానాలు తక్కువే అయినా, ప్రచారం గట్టిగా చేయడంతో ఓట్లు చీల్చ గలిగింది. ఇది బీజేపీకి బాగా కలిసి రాగా, కాంగ్రెస్ కి గట్టి దెబ్బ పడేలా చేసింది. ఎంఐఎం పార్టీ లేకపోయి ఉంటే బీజేపీ శివసేన గెలుపు అంత ఈజీ అయ్యేది కాదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయంపై మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, ఎంఐఎం బీజేపీ రహస్య ఒప్పందాన్ని త్వరలోనే బయటపెడతాంఅంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.