Tue. Jul 7th, 2020

Sambashana

Telugu News Portal

ఆపరేషన్ ఏపీ మొదలయ్యిందా?

1 min read

అంతా అనుకున్నట్లే కర్ణాటకని కైవసం చేసుకున్న బీజేపీ, ద్రుష్టి ఇప్పుడు ఏపీపై పడినట్లు ఉంది. నిజానికి 2024 వరకూ ఉమ్మడి గవర్నర్ ని కొనసాగించే అవకాశం ఉన్నా కూడా అవేమి పట్టించుకోకుండా కేంద్రంలో బీజేపీ పెద్దలు, పార్టీకి పరమ విధేయుడిగా పేరున్న బిశ్వభూషణ్ హరిచందన్ ను హుటాహుటిన గవర్నర్ గా నియమించి రాష్ట్రానికి పంపించారు. బీజేపీ అనుకున్న పనులు జరగాలన్నా, రాష్ట్రంలో వారి గాలి వీచాలన్నా వారికి సరైన సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ హరిచందన్ రూపంలో బీజేపీకి దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గవర్నర్ అండతో బీజేపీ ఏపీలో ఎలాంటి రచిస్తోంది, ఆపరేషన్ ఏపీ మొదలవడంతో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి పట్టిన గతే వైసీపీకి పట్టిస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.