Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

సంధి కాలంలో టీడీపీ… అతనే దిక్కా?

1 min read

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, తెలంగాణతో పాటు ఏపీలో కూడా టీడీపీ సంధి కాలంలో ఉందని… కోన ఊపిరితో ఉన్న ఆ పార్టీని సరైన దారిలో నడిపించే వాళ్లు కనిపించట్లేదని, చంద్రబాబునాయుడు టైం కూడా అయిపోయిందని కొందరి రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. గత కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్న ఈ మాట ఇప్పుడు, బాబు ఆరోగ్య సమస్యలతో ఫారిన్ ట్రిప్ వెళ్లడంతో, టీడీపీకి కొత్త నాయకత్వం వాదన కాస్త ముదిరింది. లోకేష్ ని టీడీపీకి ఫ్యూచర్ లీడర్ గా చేసి, పార్టీని అతన్ని చేతుల్లో పెట్టాలని బాబు ప్లాన్ చేస్తున్నా కూడా లోకేష్ పార్టీలో అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలతో పాటు అతనిలో పార్టీని ముందుండి నడిపించే సత్తాలేదని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత లోకేష్ కి పార్టీ పగ్గాలిచ్చే విషయంపై టీడీపీ క్యాడర్ కి కూడా సందేహాలున్నాయి.పైగా లోకేష్ ఇప్పటికీ మీడియా ముందు ఏం మాట్లాడితే ఎక్కడ ట్రోల్ అవుతానో అన్నట్లు ట్విటర్ వేదికగా వైసీపీపై సెటైర్లు పేల్చుతున్నారే తప్ప, బయటి ప్రంపంచంలోకి వచ్చి మాట్లాడట్లేదు. లోకేశ్ ని లీడర్ చేయాలనే ఆలోచనతో బాబు మరో లీడర్‌ను ఎదగనీయకుండా చేస్తున్నారని, దాని వళ్ల పార్టీ మరింత నష్టపోతుందనే మాట వినిపిస్తోంది. లోకేష్ కాకుండా మరి ఎవరున్నారా అని ఆలోచిస్తే అందరి నోటా వినిపిస్తున్న ఒకే మాట ‘ఎన్టీఆర్’. ప్రస్తుతం సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేస్తున్న ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలిస్తే, అతని క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో పార్టీని బ్రతికించగలడని, పార్టీ ఎదురు చూస్తున్న ఆ నేటితరం టీడీపీ టార్చ్ బేరర్ అతనే అవుతాడని క్యాడర్ తో పాటు, కొందరు కీలక నేతలు కూడా భావిస్తున్నారట. అయితే ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల వైపు వచ్చేలా కనిపించట్లేదు. మరి లోకేష్ కాకా, ఎన్టీఆర్ కూడా రాక సంధి కాలంలో ఉన్న తెలుగు దేశం పార్టీని కాపాడే ఆ కొత్తతరం నాయకుడు ఎవరు అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.