Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

300 కార్లతో మెగాస్టార్ చిరంజీవి ర్యాలీ అదిరింది

1 min read
chiranjveevi svr

సైరా హిట్ టాక్ వచ్చిన జోష్ లో ఉన్న మెగాస్టార్, తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. సుమారు 300 కార్లలో తాడేపల్లిగూడెంకు ర్యాలీగా బయలుదేరిన చిరంజీవి ఏలూరు మీదుగా తాడేపల్లిగూడెం చేరుకున్నారు. అనంతరం ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు, గత సంవత్సరం నుంచి ఎస్వీ రంగారావు విగ్రహం ఆవిష్కరించాలని నన్ను కోరారు అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఇన్నాళ్లకు నేను అభిమానించే ఎస్వీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం నా అదృష్టం. నా తండ్రి గారికి రంగారావు జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది.

chiranjeevi 300 cars rally

అలవోకగా మాట్లాడటమే ఎస్వీఆర్ ప్రత్యేకత, ఆయనను చూసే నాకు నటన పట్ల మక్కువ కలిగింది. నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే స్ఫూర్తి. అటువంటి మహా నటుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. ఆయన నటనకు హద్దులు లేవు ఆయన అంతర్జాతీయ నటుడు అలాంటి మహానుభావుడి విగ్రహం ఇక్కడ పెట్టడం ఆనందదాయకం. నా జిల్లాకు వచ్చాను, నన్ను ఆదరిస్తున్నారు, అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

సైరా చిత్రాన్ని ఆదరించిన విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేనొస్తున్నని తెలిసి ఎండను సైతం లెక్కచేయకుండా ఇక్కడకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పి తన స్పీచ్ ముగించిన చిరు, హైదరాబాద్ రిటర్న్ అయ్యాడు. ఈ మొత్తం కార్యక్రమంలో మెగాస్టార్ 300 కార్లలో తాడేపల్లి గూడెం వెళ్లడమే హైలైట్ సీన్.

READ: రివ్యూ: సైరా కథలో లోపం అదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.