Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

దర్బార్ సినిమాలో రజినీ అలా కనిపించడు

1 min read
darbar

సౌత్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో మురుగదాస్ తప్పకుండా ఉంటారు. ఎన్నో హిట్స్ ఇచ్చిన మురుగదాస్ మొదటిసారి రజినీతో చేస్తున్న సినిమా దర్బార్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి, రజినీతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మురుగదాస్ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మురుగదాస్, గజినీ విడుదలైన తర్వాత రజనీ సర్‌ నాకు ఫోన్‌ చేశారు. ఇంటికి వెళ్లి కలిస్తే అభినందనలు తెలిపారు కాని సినిమా గురించి ఎలాంటి డిస్కషన్ జరగలేదు. ఆ తర్వాత రెండేళ్లకు మళ్లీ ఓ సందర్భంలో కలిస్తే, ఒక సినిమా చేద్దామని రజినీ చెప్పారు. తలైవా అడిగినా ఎందుకు ఆలస్యం అయ్యిందో తెలియదు కానీ విజయ్ తో చేస్తున్న సర్కార్ షూటింగ్‌ జరుగుతుండగా మళ్లీ నన్ను పిలిచి సినిమా గురించి మాట్లాడారు.

darbar

ఈసారి తప్పకుండా అవకాశం వదులుకోకూడదనుకోని, లైన్‌ వినిపిస్తే రజినీకి నచ్చింది. కొన్ని మార్పులు చేసిన తర్వాత మళ్లీ కథ వినిపించగా, కథ విన్న రజినీకాంత్ నెల రోజుల తర్వాత గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో దర్బార్‌ సెట్స్ పైకి వెళ్ళింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటివరకూ నేనూ సినిమా చేయలేదు. దర్బార్ సినిమాని థియేటర్‌లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో దర్బార్ కథ గురించి మాట్లాడిన మురుగదాస్, దర్బార్ పొలిటికల్ కథ కాదని తేల్చి చెప్పాడు. అలెక్స్‌ పాండియన్‌ లాంటి పోలీస్‌ ఆఫీసర్‌ కథతో దర్బార్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. నవంబరు 7న ‘దర్బార్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.