Wed. Oct 23rd, 2019

Sambashana

Online News Portal

ఈస్ట్ కోస్ట్ చేతిలో ఇళయదలపతి బిగిల్

1 min read

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్, అట్లీ కాంబినేషన్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకూ ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు మార్చింది. ఇప్పుడు అదే సెన్సేషన్ ని రిపీట్ చేస్తూ అట్లీ, విజయ్ చేస్తున్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా `బిగిల్‌`. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భ‌గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ మూవీ తెలుగు రైట్స్ ని ఈస్ట్ కోస్ట్ బ్యానర్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ – “`బిగిల్‌` సినిమా హ‌క్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌కు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత క‌ల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. `118`తో మా బ్యాన‌ర్‌లో సూప‌ర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` సినిమాను నిర్మిస్తున్నాం. ఈ నేప‌థ్యంలో మా బ్యాన‌ర్‌లో విజ‌య్, అట్లీ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ ఏడాది రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఇదొక‌టి. హీరో విజ‌య్‌గారి కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

న‌టీన‌టులు:
విజ‌య్‌, న‌య‌న‌తార‌, వివేక్‌, జాకీ ష్రాఫ్‌, డేనియ‌ల్ బాలాజీ, అనంత్‌రాజ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె.విష్ణు
ఎడిటింగ్‌: రూబెన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.