Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

రివ్యూ: చాణక్య తెలివి చూపించాడా లేదా?

1 min read
chanakya review

ముఖ్య గమనిక: మేము మా రివ్యూని సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాతే ఇస్తాము.

చిత్రం: చాణక్య
నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్ పిర్జాదా, జరీన్ ఖాన్, నాజర్, రాజేష్ ఖట్టర్, ఉపేన్ పటేల్, రాజా సిరివెన్నెల, ఆదర్శ్ బాలకృష్ణ, సునీల్, రఘుబాబు, ఆలీ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: వెట్రి
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: అనిల్ సుంకర
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తిరు

స్పై థ్రిల్లర్ సినిమాలకి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది, సరైన కథకి అద్భుతమైన కథనం తోడైతే థియేటర్స్ దగ్గర కాసుల వర్షం కురవడం ఖాయం. ఇంతటి సెల్లింగ్ ఐటెంతో తన లక్ టెస్ట్ చేసుకోవడానికి గోపీచంద్ చాణక్యగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించాడు. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

chanakya review

కథ:
తాను టేకప్ చేసిన ఏ మిషన్ ని అయినా సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేసే రా ఏజెంట్ అర్జున్, తన ఐడెంటిటీని మార్చుకోని బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. ఆ క్రమంలో అతడికి ఐశ్వర్య పరిచయమవుతుంది, ఆ తర్వాత అతని ప్రేమలో పడుతుంది. ఐడెంటిటీ మార్చుకోని తన పని చేసుకుంటూ వెళ్లిపోతున్న అర్జున్ కి పాకిస్థాన్ మాఫియా డాన్ ఖురేషి, అతడి కొడుకు సోహైల్ నుంచి ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితిలో పాకిస్థాన్ వెళ్లిన అర్జున్, ఖురేషి సోహెల్ లకి ఎలా చెక్ పెట్టాడు? అసలు అర్జున్ కి పాకిస్థాన్ మాఫియా డాన్స్ నుంచి వచ్చిన సమస్య ఏంటి అనేదే చాణక్య కథా కథనం.

విశ్లేషణ:
సిరియాలో అర్జున్ చేసే మిషన్ తో మొదలయిన చాణక్య సినిమా, ఇంట్రెస్టింగ్ నోట్ లో స్టార్ట్ అవుతుంది. ఈ మిషన్ జరిగే అంతసేపు బాగానే ఉంటుంది కానీ హీరో ఏజెంట్ అవతారం నుంచి బ్యాంకు ఉద్యోగిగా మారాక ఒక రొటీన్ కామెడీతో నార్మల్ సినిమాగా కనిపించడం మొదలయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన లవ్ అండ్ కామెడీ ట్రాక్ రెండూ అంతగా అతకలేదు. ముఖ్యంగా దాదాపు పావుగంట పాటు సాగిన కుక్క కామెడీ కాస్త సహనాన్ని పరీక్షించినట్లు అనిపిస్తుంది. మళ్లీ ప్రీఇంటర్వెల్ నుంచి చాణక్య సినిమా వేగం పుంజుకుంటుంది. అర్జున్ పాకిస్థాన్ వెళ్లిన తర్వాత చాణక్య చాలా ఎంగేజింగ్ గా సాగింది. లేడీ ఏజెంట్ సహకారంతో అర్జున్ మిషన్ ని లీడ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకూ చాణక్య సినిమా ట్విస్ట్స్ తో బాగానే నడిచింది. ఫస్ట్ హాఫ్ లో కాస్త జాగ్రత్తపడి ఉంటే చాణక్య ఇంకా బాగుండేది.

నటీనటులు:
రా ఏజెంట్ గా గోపీచంద్ తన లుక్స్ తోనే మెప్పించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో గోపీచంద్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. బ్యాంకు ఉద్యోగిగా డీసెంట్ గా కనిపించే సమయంలో అలవాటు పనేదైనా చేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, గోపీచంద్ అలానే కనిపించాడు. అర్జున్ పాత్రకి మాత్రం గోపీచంద్ 100% న్యాయం చేశాడు. ఇక ఐశ్వర్య పాత్రలో కనిపించిన మెహ్రీన్ చేయడానికేమి లేదు. పాటలకి ప్రేమకథకి మాత్రమే ఆమె అంకితం అయ్యింది. మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన జరీన్ ఖాన్ మంచి పాత్రలో కనిపించింది. డెబ్యూ సినిమాతోనే డీసెంట్ రోల్ ప్లే చేసింది. రాజేష్ ఖట్టర్, ఉపేన్ పటేల్, నాజర్ లు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. సునీల్, రఘుబాబు, ఆలీలు ఉన్నంత సేపు నవ్వించే ప్రయత్నం చేశారు.

chankya genuine review

సాంకేతిక వర్గం:
స్పై థ్రిల్లర్ అనే మంచి పాయింట్ చుట్టూ కథని అల్లుకున్న దర్శకుడు తిరు, దాన్ని అంతే బాగా రాసుకోవడంలో కొంతమేర విఫలమయ్యాడు. టెక్నీకల్లీ అండ్ విజువల్లీ చాణక్యకి గ్రాండ్నెస్ తీసుకు రావడంలో సక్సస్ అయ్యాడు కానీ రా ఏజెంట్ కథకి ఉండాల్సిన అథెంటిసిటీ మాత్రం ఎక్కడో మిస్ కొట్టాడు. విశాల్ చంద్రశేఖర్ పాటలు ఆకట్టుకోవు కానీ శ్రీచరణ్ పాకాల బీజీఎమ్ మెప్పిస్తుంది. వెట్రి సినిమాటోగ్రఫీ బాగుంది, పాకిస్థాన్ ని ఫారిన్ లొకేషన్స్ ని రియలిస్టిక్ గా చూపించారు. యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. స్క్రీన్ పైన ఖర్చు కనిపిస్తుంది. అనిల్ సుంకర చాణక్య సినిమాకి కావాల్సినవన్నీ ఇచ్చారు కానీ అవి కథకి అవసరమా? కథనంలో మార్పులు చేస్తే బాగుండేదా అని అలోచించి ఉంటే చాణక్య ఫస్ట్ హాఫ్ డెఫినెట్లీ వే బెటర్ గా ఉండేది. ఎడిటింగ్ పరంగా మార్తాంగ్ కె వెంకటేష్ చాణక్య సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో. మొత్తంగా చాణక్య సినిమా అక్కడక్కడా మంచి మెరుపులతో మెప్పిస్తుంది కానీ చాలా కాలంగా గోపీచంద్ ఎదురు చూస్తున్న భారీ విజయం అందించే సినిమా మాత్రం కాకపోవచ్చు. ఏది ఏమైనా సినిమా తలరాతని డిసైడ్ చేసేది సినీ అభిమానులే కాబట్టి చాణక్య ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

చివరి మాట: గోపీచంద్ లాంటి యాక్షన్ హీరోని చేతిలో పెట్టుకోని, స్పై థ్రిల్లర్ లాంటి పాయింట్ ని ఆయుధంగా చేసుకోని, అనీల్ సుంకర లాంటి నిర్మాతని ఆసరాగా తీసుకోని అద్భుతమైన సినిమా తీయాల్సింది పోయి తిరు, అక్కడక్కడ మాత్రమే మెరిసే సినిమా చేశాడు. తిరుతో పాటు, తప్పకుండా మాట్లాడుకోవాల్సింది మాటల రచయిత అబ్బూరి రవి గురించే. గూఢచారి లాంటి స్పై సినిమాకి తన పెన్నుతోనే బలం తెచ్చిన రవి, అదే జానర్ లో తెరకెక్కిన చాణక్య విషయంలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకయాడు. స్పై సినిమాకి రాయాల్సిన రేంజులో డైలాగులు పడలేదు, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి రాసినట్లు రాసి రవి పనికానిచ్చేశాడు. ఒక సందర్భంలో హీరోయిన్ ఏంటి బార్డర్ దాటుతున్నావ్ అంటే, అప్పటికి ఐడెంటిటీ మార్చుకోని బ్రతుకుతున్న అర్జున్ “అవును, డ్యూటీలో భాగంగా నేను బార్డర్స్ దాటుతుంటా” అనే డైలాగ్ చెప్తాడు. సిట్యుయేషన్ కి సంబంధం లేని ఈ ఒక్క డైలాగ్ చాలు అబ్బూరి రవి ఏ స్థాయిలో ఆలోచించాడో అర్ధం చేసుకోవడానికి.

Read: రివ్యూ: సాహూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.