Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

సైరా ట్రైలర్ లోని గొప్ప విషయం అదే… ఆ సీన్ చూపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు

1 min read

కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి సౌండ్ వరకు 24 క్రాఫ్టులు సైరా కోసం ప్రాణం పెట్టి పని చేశారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పార్థి సీన్ ని పీక్ స్టేజ్ లో ఎలివేట్ చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సైరా సినిమాకి మరో అస్సెట్ అయ్యింది. సైరా ట్రైలర్ లో చూపించిన మరో ముఖ్యమైన విషయం, క్లైమాక్స్ ని రివీల్ చేయడం. చరిత్ర ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషర్లు ఉరివేసి చంపారు, మూడు దశబ్దాలపాటు కోయిలకుంట్ల కోటకి నరసింహారెడ్డి తలని వేలాడదీసారు అంటే తెల్లదొరలని ఆయన ఎంత భయపెట్టడో అర్దం చేసుకోండి. ఉయ్యాలవాడ కథలోనే ముఖ్య ఘట్టమైన ఈ సంఘటన సైరా సినిమాలో చూపిస్తారా లేదా, చిరు చనిపోయే సన్నివేశం చూపించే సాహసం చేయగలరా అనే అనుమానం అందరికీ ఉండేది. ట్రైలర్ లో ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పేసింది. చరిత్రని ఏమాత్రం మార్చకుండా సైరా సినిమా క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరివేసి చంపే సీన్ ని యధావిథిగా పెట్టారు. ఈ ప్రాసెస్ లో వచ్చే సీన్ ప్రీ క్లైమాక్స్ నుంచి పీక్ స్టేజ్ కి వెళ్లనున్నాయి, హై ఎమోషనల్ నోట్ లో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకి వస్తారు అనడంలో సందేహం లేదు. అప్పటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాటం చేస్తే అక్టోబర్ 2న ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయనున్నాడు. ఆ దాటి ఎలా ఉంటుందో తెలియాలి అంటే శాంపిల్ గా సైరా ట్రైలర్ చూడండి చాలు.

https://youtu.be/KyhrrdpA2YA

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.