Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలికి అవమానం

1 min read
bahubali royal albert hall

హెడ్డింగ్ చూసి ఇదేంటి తెలుగు సినిమానే కాదు మరే ఇండియన్ సినిమాకి దక్కని గౌరవం బాహుబలికి దక్కితే అవమానం అంటున్నారు అనుకుంటున్నారా? అవును మనం గొప్పగా చెప్పుకుంటున్న రాయల్ ఆల్బర్ట్ హాల్లో బాహుబలి సినిమాకి అవమానం జరిగింది. బాహుబలికే కాదు యావత్ తెలుగు సినిమాకే ఈ అవమానం జరిగినట్లు. ఇంతకీ ఆ అవమానం ఏంటా అని ఆలోచిస్తున్నారా? లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లైవ్ పెర్ఫామెన్స్ తో స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే.

bahubali royal albert hall

ప్రపంచంలోనే ఈ ఘనత అందుకున్న తొలి నాన్ – ఇంగ్లీష్ ఫిలిం ‘బాహుబలి ది బిగినింగ్’ మాత్రమే. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ రాయల్ యూనియన్ కి చిత్ర యూనిట్ అంతా కలిసి వెళ్లారు. ఇక్కడి వరకూ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ బాహుబలికి జరిగిన అవమానం ఏంటి అంటే, రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్క్రీనింగ్ చేసింది బాహుబలి సినిమానే కానీ అది హిందీ వెర్షన్ కావడం బాధాకరం. సినిమా ఒరిజినల్ వెర్షన్ తెలుగు అయితే డబ్బింగ్ వెర్షన్ ను స్క్రీనింగ్ చేయడం బాధాకరమే కాదు అవమానం కూడా.

చాలా కాలంగా వరల్డ్ మార్కెట్ లో హిందీ సినిమానే ఇండియన్ సినిమాగా చూస్తున్నారు. రాజమౌళి బాహుబలితో ఈ చరిత్ర తిరగరాసి, బాలీవుడ్ మేకర్స్ కి కూడా సాధ్యం కానీ ఈ జనరేషన్ క్లాసిక్ ని చూపిస్తే రాయల్ అల్బెర్ హాల్ లో బాహుబలి హిందీలో స్క్రీనింగ్ చేయడం ఏంటో వారికే తెలియాలి. దీనికి జక్కన్న ఎందుకు ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.