Tue. Mar 31st, 2020

Sambashana

Online News Portal

15 ఏళ్ల తర్వాత ఆ హిస్టారికల్ ప్లేస్ లో పవర్ స్టార్

1 min read
pawan kalyan

జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం చార్మినార్, తాజ్ మహల్ సెట్స్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని ఈ సెట్స్ లో షూట్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో తాజ్ మహల్ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, 98లో వచ్చిన తొలిప్రేమ సినిమాలో ఏకంగా ఒక సాంగ్ నే తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశారు. గగనానికి ఉదయం ఒకటే అనే సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది.

తొలిప్రేమ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ 2005లో వచ్చిన బాలు సినిమాలో కూడా తాజ్ మహల్ నేపథ్యంలో సీన్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ చనిపోయే సీన్, దాని తర్వాత వచ్చే ఫైట్… బాలు మోవీకే హైలైట్ గా అనిపిస్తాయి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలో తాజ్ మహల్ కనిపించిన ప్రతిసారి స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ అయ్యింది. మరి ఈసారి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.