Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

తొమ్మిదేళ్లు అయినా ఆ ఒక్క కారణం తెలియట్లేదు

1 min read
orange 9 years

ప్రేమకథతో తెరకెక్కిన సినిమా హిట్ అవ్వాలి అంటే ముందు మంచి సాంగ్స్ ఉండాలి, ఆకట్టుకునే టైటిల్ ఉండాలి, కదిలించే సీన్ ఉండాలి, మెప్పించే డైలాగ్స్ ఉండాలి. వీటన్నింటికన్నా ముందు ఫీల్ గుడ్ కథ ఉండాలి అంతకన్నా మంచి కథనం ఉండాలి. దాన్ని తెరపై ప్రెజెంట్ చేయగలిగే అద్భుతమైన లీడ్ పెయిర్ ఉండాలి. అప్పుడు ఏ లవ్ స్టోరీ అయినా హిట్ కాదు సూపర్ హిట్టే అవుతుంది.

ఇవన్నీ ఉన్నా కూడా ఆడని సినిమా ఏదైనా ఉందా అంటే అది ఆరంజ్ మాత్రమే. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ మూవీలో పైన చెప్పిన ప్రతి ఎలిమెంట్ కానీ ప్రేక్షకులని మెప్పించడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యింది. తొమ్మిదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆరంజ్ సినిమా ఇప్పుడు చూసినా, ఇది ఎందుకు థియేటర్ లో ఆడలేదు అనే డౌట్ వస్తుంది. మగధీర తర్వాత రావడం ఆరెంజ్ కి శాపమా? లేక మరేదైనా కారణమా అనేది తెలియదు కానీ ఆరెంజ్ సినిమా డిసర్వ్ బెటర్ రిజల్ట్ అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.