Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

తాగుబోతు రమేష్ జబర్దస్త్ ఎంట్రీ… కొత్త ప్రోమో అదిరింది

1 min read
jabardasth latest promo

గత మూడు నెలలుగా కరోనా కారణంగా అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమాలు సీరియళ్లు షోస్ అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ బ్రేక్ పడి ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. రీసెంట్ గా ప్రభుత్వాలు కొన్ని కండిషన్స్ తో షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడంతో, తక్కువ మందితో తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టారు. సినిమా వాళ్లు కరోనా భయంతో కాస్త వెనకడుగు వేస్తున్నా, బుల్లితెర పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే జీ తెలుగు సీరియల్స్ ని త్వరలో టెలికాస్ట్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసేసింది. ఇప్పుడు ఈటీవీ వాళ్లు మోస్ట్ సెలెబ్రేటెడ్ షో జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు.

ఈ గురువారం ఎపిసోడ్ తో జబర్దస్త్ మళ్లీ టెలికాస్ట్ కానుంది అయితే గతంలో ఉన్న ఆరు టీమ్స్ నుంచి రెండు అవుట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రోమోలో చూపించిన వారిలో హైపర్ ఆది, అదిరే అభి, చలాకి చంటి, రాకెట్ రాఘవ, వెంకీ మంకీస్ టీమ్స్ పెర్ఫర్మ్ చేశాయి. వీరితో పాటు తాగుబోతు రమేష్ కొత్త టీం లీడర్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ కమెడియన్ గా సినిమాలు చేస్తున్న తాగుబోతు రమేష్, బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడం కొందరికి షాక్ ఇచ్చే విషయమే. యాంకర్ గా అనసూయ, జడ్జిగా రోజా, నాగబాబు ప్లేస్ లో మనో… అలానే ఉన్నారు. మొత్తానికి కొత్త టీమ్స్ తో, మూడు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ నవ్వించడానికి వస్తున్నాం అనే నమ్మకం కలిగించిన ఈ ప్రోమో ఆరు నిమిషాల పాటు కంప్లీట్ ఫన్ ని ఇచ్చింది. జబర్దస్త్ ప్రోమో అయితే బయటకి వచ్చింది మరి ఎక్స్ట్రా జబర్దస్త్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.