Tue. Mar 31st, 2020

Sambashana

Online News Portal

తెలుసుకోని మాట్లాడితే బాగుండేది ఎక్స్ జేడీ

1 min read
JD Pawan Kalyan Janasena

జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పుడిప్పడే ప్రజల్లోకి దూసుకెళ్తున్న ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ పార్టీలో కీలక నాయకుడిగా తన వంతు పాత్ర పోషించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో ఆయన ప్రస్తావించిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే అదేస్థాయిలో లక్ష్మీనారాయణ లేఖకు పవన్ కళ్యాణ్ దీటుగా బదులిచ్చారు.

JD Pawan Kalyan Janasena

జనసేన పార్టీకీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం ప్రస్తుతం రాజాకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్‌ విధివిధానాలు నచ్చి జనసేనలో చేరుతున్నట్లు చెప్పిన.. ఆయన రాజీనామాలో చెప్పిన మాటలు అందరిని ఆశ్యర్యానికి గురి చేశాయి. జనసేనాని మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లడమే తన రాజీనామాకు కారణమని లక్ష్మీనారాయణ లేఖలో ప్రస్తావించారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల కోసం ఈ జీవితం అంకితం… ఇక సినిమాలు చేయనని చెప్పారు. ఇప్పుడు ఆ మాటను తప్పుతూ మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో మీకు ఏ విషయంలో నిలకడలేదనే విషయం అర్ధమవుతుంది. అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ లక్ష్మీనారాయణ లేఖలో రాసి… జనసేనానికి పంపించారు. అలాగే విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రజలకు, అండగా నిలిచిన జనసైనికులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో లేకపోయిన వ్యక్తిగతంగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

జనసేన పార్టీకి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు జనసేనాని వెల్లడించారు. లక్ష్మీనారాయణ లేఖలో పేర్కోన్న వాఖ్యలకు సమాధానంగా పవన్‌ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలులాంటివి ఏమీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే అని జనసేనాని చెప్పారు.

నా మీద ఆధారపడి అనేక కుటుంబాలున్నాయి. వారికోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అని పవణ్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయాలన్ని లక్ష్మీనారాయణ తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. పార్టీకీ రాజీనామా చేసినప్పటికీ ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని పవన్‌ కళ్యాణ్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.