Sun. May 31st, 2020

Sambashana

Telugu News Portal

ఆర్.ఆర్.ఆర్ వచ్చిన ఏడాదిన్నర లోపే మరో పాన్ ఇండియన్ సినిమా

1 min read
ntr prashanth neel

‘కేజీఎఫ్’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ మూవీని నిర్మించనుంది. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే తారక్‌, ప్రశాంత్ నీల్ కలిసి పనిచేసే సినిమా ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది కానీ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ కరోనా కారణంగా అది జరిగేలా కనిపించట్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వర్క్ ఇంకా బాలన్స్ ఉంది, ఇది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మాటల మాంత్రికుడితో మరోసారో చెయ్ కలపడానికి సిద్దమయ్యాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యే సరికి 2021 అయిపోతుంది. సో తక్కువలో తక్కువ వేసుకున్నా ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమా 2022లో కానీ 2021 చివరలో కానీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ కాంబో సినిమా ఎప్పుడు సెట్ అయినా అది పాన్ ఇండియా మూవీ అవ్వడం ఖాయం.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.