Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

ఎన్ని హిట్స్ ఇచ్చినా రాని కిక్కు ఒక్క పోస్టర్ తో ఇచ్చాడు

1 min read
mass mahesh babu from sarileru neekevvaru

సూపర్ స్టార్ మహేశ్ బాబుని కొరటాల శివ, వంశీ పైడిపల్లి, మురుగదాస్ లు కాస్త సైలెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ దర్శకులు తీసిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మహేశ్ బాబుని మరో పోకిరి, ఇంకో ఒక్కడు రేంజులో చూపించలేదు. సూపర్ స్టార్ ని అలా చూడాలి అనుకున్న ఘట్టమనేని అభిమానులు ఎప్పటికప్పుడు ఉన్న దాంతో సర్దుకుంటూనే ఉన్నారు. అప్పుడు వచ్చాడు అనీల్ రావిపూడి. గట్టిగా అయిదు సినిమాల అనుభవం కూడా అనీల్ రావిపూడి ఘట్టమనేని అభిమానుల ఆకలి ఒక్క పోస్టర్ తో తీర్చేశాడు. మహేశ్ బాబు ఎన్ని హిట్స్ ఇచ్చినా కూడా రాని కిక్కు ఒక్క పోస్టర్ తోనే అనిల్ రావిపూడి ఇచ్చాడు. ఇంతకీ ఏంటా పోస్టర్ అనే కదా మీ డౌట్, దసరా సందర్భంగా అన్ని ఇళ్లల్లో ఆయుధ పూజ జరుగుతుంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి వచ్చిన దసరా స్పెషల్ కొత్త పోస్టర్ లో స్వామే ఆయుధం పట్టుకోని, చెడుని తెగనరకడానికి రెడీ అయ్యాడు.

mass mahesh babu from sarileru neekevvaru

ఈ పోస్టర్ కన్నా ముందు మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా, ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేసిన పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వీటిని తలదన్నేలా సరిలేరు నీకెవ్వరు కొత్త పోస్టర్ ఉంది. కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకోని నిలబడిన మహేశ్ పోస్టర్ ఊరమాస్ అసలు. బ్లాక్ షర్ట్ లో, ఆర్మీ ప్యాంటులో మహేశ్ మాస్ ని రీడిఫైన్ చేస్తున్నాడు. నిజానికి కొండారెడ్డి బురుజుకి, మహేశ్ కి ఎక్కడో తెలియని కనెక్షన్ ఉన్నట్లుంది. ఒక్కడు సినిమాలో మహేశ్ ఒక్క డైలాగ్ చెప్పకుండా అలా నిలబడితేనే ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా గొడ్డలి పట్టుకోని నిలబడ్డాడు. రిజల్ట్ ట్రేడ్ వర్గాల ఊహలకే వదిలేస్తూ ఘట్టమనేని అభిమానులు, మహేశ్ బాబు కొత్త అవతారాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ పండగ చేసుకోండి. ఇక దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుకోవాలి ఒక స్టార్ హీరో దొరికితే ఏ రేంజులో వాడుకుంటానో చూపించిన అనీల్ రావిపూడి, సరిలేరు నీకెవ్వరు కొత్త పోస్టర్ ని అభిమానులకి ఎలా కావాలో, వాళ్లు మహేశ్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడు. సినిమాలో ఇంతకు మించి ఉంటే మాత్రం నిజంగానే మహేశ్ కి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర సరిలేరు ఇంకెవ్వరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.