Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

మన కథని అందరికీ తెలిసేలా చేసిన మీకు వందనం మాస్టారు

1 min read

ఎన్నో ఏళ్లుగా మిగిలిపోయిన కల నెరవేరితే ఎలా ఉంటుంది? ఆ కల నిజమైన రోజు ఎంత సంతోషంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానం పరుచూరి బ్రదర్స్ ని అడిగితే పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే సైరా కథతో మిగిలిన అందరూ రెండేళ్ల మాత్రమే ప్రయాణం చేస్తే, ఈ సోదరులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో నటిస్తే అనే కలని కన్నారు. అదే కలని మోస్తూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో 14 ఏళ్ల పాటు సావాసం చేసింది పరుచూరి సోదరులు మాత్రమే. ఏ తల్లి అయినా కడుపులో బిడ్డని తొమ్మిది నెలలే మోస్తుంది కానీ దేశం మర్చిపోయిన వీరుడు కథని సినిమాగా చేయాలి అనే ఆలోచనతో పరుచూరి బ్రదర్స్ సైరా కథని వాళ్ల మస్తిష్కములో దశాబ్దమున్నర పాటు మోశారు. సినిమాల్లోకి రావాలి అనుకునే వారికి ఈ సంఘటన ఇప్పటికీ స్ఫూర్తినిస్తుంది, ఏ ఆలోచనా, ఏ కథా నిరుపయోగంగా మిగిలిపోదు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఉయ్యాలవాడ కల వాళ్లని దాదాపు దశాబ్దమున్నర పాటు కన్న పరుచూరి బ్రదర్స్, ఎదురు చూస్తున్న కాలం సైరా రూపంలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సైరాకి ఆల్ సెంటర్స్ లో పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్, మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే వీరందరి కన్నా సైరా సినిమా విజయంతో పరుచూరి బ్రదర్స్ చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉండి ఉంటారు. అక్టోబర్ 2, పరుచూరి సోదరుల పద్నాలుగేళ్ల కల నిజమైన రోజు. సైరా సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసిన పరుచూరి సోదరులలో ఒకరైన గోపాలకృష్ణ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పద్నాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగాస్టార్‌కి, ఆయన కడుపున పుట్టిన పులిబిడ్డ రామ్‌చరణ్‌కి వందనం’ అంటూ జీకే ట్వీట్ చేశారు. నిజానికి మేము మర్చిపోయిన మన వీరుడి కథని ప్రపంచానికే తెలిసేలా చెప్పిన మీకు వందనం మాస్టారు. ఈ సైరా విజయం మా అందరి తరుపు నుంచి మీకే అంకితం పరుచూరి సోదరులారా…

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.