Wed. Oct 23rd, 2019

Sambashana

Online News Portal

నష్టాల లిస్ట్ రావడమే మిగిలింది

1 min read
sye raa loss

రిలీజ్ కి ముందు ఆకాశాన్ని తాకే అంచనాలు, రిలీజ్ డే ఫస్ట్ షోకే హిట్ టాక్. మెగాస్టార్ బాక్సాఫీస్ దుమ్ము ధులపడం ఖాయం అన్నారు. రెండో రోజు దాటే సరికి బళ్లు ఓడలయ్యాయి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సైరా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. టాక్ పరంగా హిట్ అనిపించుకున్న సైరా, ట్రేడ్ పరంగా ఫ్లాప్ అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సైరాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మొదటి వారంలో సైరా రికవర్ చేస్తూ 75 శాతం రాబట్టింది. వారం రోజుల్లో సైరా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 83 కోట్ల 23 లక్షల రూపాయల షేర్ వసూళ్లు చేసింది. నిజానికి ఇవి సరిపోవు, 200 కోట్లు రాబడితేనే సైరా బ్రేక్ ఈవెన్ చేరుతుంది. అంటే ఎటు చూసిన సైరా సినిమా దాదాపు ఇంకో 120 కోట్ల షేర్ రాబట్టాలి. నార్త్ నుంచి మొదలుపెడితే తమిళనాడు వరకూ సైరా బ్రేక్ ఈవెన్ చేరడం కష్టంగానే కనిపిస్తుంది. మంచి వసూళ్ళు రాబడుతున్న తెలుగులో అయినా ఇంకో 120 కోట్లు రాబట్టడం అనేది అసాధ్యం. దసరా సెలవలు అయిపోయాయి కాబట్టి సైరాకి మరింత దెబ్బ తగిలేలా ఉంది, అయితే దెగ్గరలో పెద్ద సినిమా విడుదల లేకపోవడం సైరా సినిమాకి కలిసొచ్చే అంశం. ఇప్పుడున్న ట్రేడ్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం సైరా నష్టాలని మిగిలించడం ఖాయం, మరి అది ఏ స్థాయిలో అనే మాత్రం తెలియాల్సి ఉంది.

sye raa loss

ఇండియా పరిస్థితి ఇలా ఉంటే ఓవర్సీస్ మరి దారుణంగా ఉంది. ప్రీమియర్స్ తోనే రికార్డులు లేపుతాడు అనుకున్న చిరు, ఇప్పటి వరకూ అక్కడ రాబట్టింది 2.2 మిలియన్ డాలర్లు మాత్రమే. నిజానికి ఇవి మంచి వసూళ్లే అయినా సైరా బిజినెస్ తో పోల్చి చూస్తే అది సరిపోదు. సైరా సినిమా అక్కడ 3.3 మిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకూ కేవలం 2.2 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. మరో 1.1 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంది. ఓవర్సీస్ లో థియేట్రికల్ రన్ దాదాపు కంప్లీట్ కావడంతో అక్కడ కూడా సైరాకి నష్టాలు తప్పవని అర్థమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.