Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

ఒకే దేశం, ఒకే ఎలెక్షన్, ఒకే బాషా… మరి ఒకే?

1 min read

అఖండ భారతం, హిందుస్థాన్… కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నాయకుల నుంచి వినిపిస్తున్న ఏకైక నినాదం. అఖండ భారతం అంటే ఏంటో తెలియదు కానీ హిందుస్థాన్ అంటే స్పష్టంగా తెలుసు, ఈ దేశం హిందువులది మాత్రమేనా? మిగిలిన వాళ్లది కాదా? హిందువులది మాత్రమే ఈ దేశం అయినప్పుడు బీజేపీ మైనారిటీ వాళ్లకి రిజర్వేషన్లు ఎందుకు ఇస్తోంది? ఓట్ల కోసమేనా… ఒకవేళ ఓట్ల కోసమే అయితే, మరి ఈ దేశం వాళ్లది కూడా అవ్వాలి కదా… మరి హిందుస్థాన్ అనే పేరు మాత్రమే ఎందుకు వాడుతున్నారు? సరే ఈ గోల ఎప్పుడూ ఉండేదే అనుకుంటే కొత్తగా ఒకే ఎన్నిక, ఒకే భాష అంటున్నారు. దేశమంతా ఒకే ఎన్నిక అనేది జరగని పని, ఏ రాష్ట్ర అవసరాలకు… ఆయా రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దేశమంతా ఒకే ఎన్నిక అనేది కష్టం.

ఇక ఒకే భాష విషయానికి వస్తే బాషా ప్రాతిపదికన విడిపోయిన రాష్ట్రాలెన్నో ఉన్నాయి. మన దేశంలో ప్రతి వంద కిలోమీటర్లకి యాస మారుతుంది, ప్రతి రెండు వందల కిలోమీటర్లకి బాషా మారుతుంది. ఎన్ని మారినా ఒకరి సంప్రదాయాలకు ఇంకొకరు విలువిస్తారు కాబట్టే మన దేశం గొప్పది. అదే మన దేశంలోని ఐకమత్యానికి చిహ్నం. అంతేకానీ దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా తెలియని హిందీని తీసుకొచ్చి దేశబాష అంటే మిగిలిన ప్రాంతాల వాల్ల భాషలు ఏమైపోవాలి? ఎక్కువమంది హిందీ మాట్లాడితే మన దేశ బాషా హిందీ అయిపోదు, దేశంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని నేషనల్ అనిమల్ కుక్కని చేయలేరు కదా. సరే ఒకే దేశం, ఒకే ఎన్నిక ఒకే భాష అన్నారు కదా… ఒకే మతం అని చూడండి మీ రాజకీయ పునాదుల కింద భూకంపం వస్తుంది, తిరుగుబాటు నుంచి కొత్త భారతం పుడుతుంది. ప్రతి ప్రాంతాన్ని, ఆ ప్రాంత పద్దతులను, పరిస్థితులను గౌరవించండి అప్పుడే దేశం బాగుంటుంది.

Note: కుక్క అనే పదం ఎవరి మనోభావాలు దెబ్బతీసినా క్షమించండి… అది ఒక ఉదహరణగానే ఉపయోగించాము తప్ప ఎవరి మనిభావలని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో కాదు.

చివరి మాట: మితిమీరిన నియమనిబంధనలు, మనుషుల్ని గౌరవించలేని పద్ధతులు ఐకమత్యాన్ని ఇవ్వవు, తిరుగుబాటుని తప్ప…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.