Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

గత 20 ఏళ్లలో మహేశ్ బాబుని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

1 min read

సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న మహేష్ బాబు, కరోనా హాలిడేస్ ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. రోజుకో మహేష్ ఫోటోనో రిలీజ్ చేస్తున్నన నమ్రత తాజాగా ఇంకో ఫోటోను పోస్ట్ చేశారు.

ఆ ఫొటోలో మహేష్ బాబు తన కూతురితో స్విమ్మింగ్ పూల్‌ లో ఆడుకుంటున్నాడు. స్విమ్మింగ్ పూల్ లో ఉంటె వింత ఏముంది అనుకుంటున్నారా… ఆ ఫొటోలో మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించాడు. మాస్ క్లాస్ ఫ్యామిలీ అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసిన మహేష్ ఇప్పటివరకు షర్ట్ తీసింది లేదు, ఎప్పుడూ బాడీ చూపించింది లేదు. కేవలం షర్ట్ తీయాల్సి వస్తుందని మహేష్ సినిమాలు వదిలేశాడనే గుసగుసలు కూడా అప్పట్లో చాలానే ఉన్నాయి. అలాంటిది మొదటిసారి మహేష్ ఇలా షర్టు లేకుండా కనపడడంతో ఘట్టమనేని అభిమానులు ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా సరే కానీ ఆన్ స్క్రీన్ ఇలా ఎప్పుడు కనిపిస్తాడో అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.