Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

అపూర్వ కలయిక ఆరోజైనా జరిగే పనేనా?

1 min read
nandamuri family

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంత మంచి వాడవురా. సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకోస్తున్నారు. జనవరి 15న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 8న గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సాంగ్స్ అండ్ ప్రోమో వీడియోస్ తో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, ఎంత మంచి వాడవురా సినిమాకి మరింత హైప్ తీసుకురావడనికి సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ లోనే భారీ ప్రీ రిలీజ్ చేయనున్న మేకర్స్, ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణని గెస్టులుగా పిలుస్తున్నారని సమాచారం. బాబాయ్ అబ్బాయిలు ఎప్పుడు కలిసి కనిపించినా నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అయితే ఈ ఏడాది ఎన్టీఆర్ సినిమా చేయకపోవడం, బాలయ్య మూవీ చేసినా ఈవెంట్ కి అబ్బాయిలు రాకపోవడంతో 2019 సంక్రాంతి సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ తర్వాత అన్నగారి కుటుంబం కలిసి కనిపించలేదు. సరిగ్గా ఏడాది తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా కోసం ఇప్పుడు మళ్లీ ఈ హీరోలు కలుస్తున్నారు. ఈ ఈవెంట్ ని నందమూరి అభిమానులు ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారో చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.