Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

బాలయ్య ఒక సైడే చూపిస్తున్నాడు #NBK105

1 min read

నందమూరి నట సింహం బాలకృష్ణ, జై సింహ కాంబినేషన్ రిపీట్ చేస్తూ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. #NBK105 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే బాలయ్య లుక్ ఒకటి బయటకి వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది. అవెంజర్స్ టోనీ స్టార్క్ లా ఉన్నాడంటూ బాలయ్యకి అందరూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దసరా కానుకగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. స్టైలిష్ లుక్కులో ఉన్న బాలకృష్ణ, సూటు బూటూ వేసుకోని కత్తి పట్టుకోని ఉన్నాడు. బట్టలు, మహం నిండా రంగు ఉండడంతో ఫేస్ సరిగ్గా కనిపించలేదు కానీ నటసింహం మాత్రం సింహంలానే ఉన్నాడు. బోయపాటి సినిమా కోసం తగ్గుతున్నాడో లేక ఈ సినిమా కోసమే తగ్గుతున్నాడో తెలియదు కానీ బాలయ్య మాత్రం బాగా సన్నబడ్డాడు.

NBK105 Dasara Poster

ఒకవైపే చూడు ఇంకో వైపు చూడొద్దు అన్నట్లు, #NBK105 నుంచి ఎంతసేపటికీ ఒకటే లుక్కు చూపిస్తున్నారు కానీ ఇంకో లుక్ ని మాత్రం రివీల్ చెయ్యట్లేదు. రౌడీ ఇన్స్పెక్టర్ రేంజులో ఆ లుక్ ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తుంది కానీ అది ఎలా ఉంటుంది అనే విషయం మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వట్లేదు. మరి దీపావలికైనా ఆ పోలీస్ పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో చూపిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.